నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ హాయ్ నాన్న ట్రైలర్ కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.ఎమోషనల్ రోలర్ కోస్టర్ గా వచ్చిన ఈట్రైలర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటూ సినిమా ఫై అంచనాలను పెంచేసింది.ఇక విడుదలకు ఒక్క రోజే ముందే తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమా పెయిడ్ ప్రీమియర్ షోలు వేయనున్నారు.నాని ఈసినిమా విజయం ఫై ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు దానికి తోడు రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ కూడా ఇంకొంచెం బూస్ట్ ఇచ్చింది.దాంతో ప్రీమియర్ షో లు వేద్దాం అని హాయ్ నాన్న టీం డిసైడ్ అయ్యింది.డిసెంబర్ 6న రాత్రి సెలెక్టడ్ థియేటర్లలో ఈషోస్ పడనున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బ్యూటిఫుల్ ఎమోషనల్ లవ్ డ్రామాగా నూతన దర్శకుడు శౌర్యువ్ తెరకెక్కించిన ఈసినిమాలో సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా బేబీ కైరా ఖన్నా నాని కూతురిగా కనిపించింది.ప్రముఖ బాలీవుడ్ నటుడు అంగాద్ బేడీ ఈసినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు.హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందించగా వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది.డిసెంబర్ 7న హాయ్ నాన్న తెలుగుతోపాటు హిందీ,మలయాళ ,తమిళ,కన్నడ భాషల్లో విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: