బబుల్ గమ్- ఇజ్జత్ సాంగ్ ప్రోమో రిలీజ్

izzat song promo out from bubble Gum movie

బుల్లి తెర స్టార్ యాంకర్ సుమ తనయుడు రోషన్ హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. క్షణం, కృష్ణ అండ్ హిజ్ లీల సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రవికాంత్ పేరెపు దర్శకత్వంలో రోషన్ హీరోగా వస్తున్న సినిమా బబుల్ గమ్. డిసెంబర్ 29 వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పటికే ఈసినిమా నుండి హబీబీ జిలేబీ అనే పాటను రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు మరోపాటను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు మేకర్స్. ఇజ్జత్ అంటూ వచ్చే ఈపాట సెల్ఫ్ రెస్పెక్ట్ కు యాంథమ్ లా రూపొందించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈపాట ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఇజ్జత్ ఇచ్చిపుచ్చుకుంటే మంచిది.. ఇజ్జత్ ఇయ్యకుంటే లొల్లి తప్పది అంటూ వచ్చే పాట కూడా ఆకట్టుకుంటుంది. ఫుల్ సాంగ్ మెగాస్టార్ చిరు చేతుల మీదుగా రేపు ఉదయం 11 గంటల 7 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు.

కాగా ఈసినిమాలో మానస చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి మహేశ్వరి మూవీస్ నిర్మిస్తున్న ఈసినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం.. సురేష్ రగుతు సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − one =