ఈ ఏడాది సార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధనుష్ ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అరుణ్ మాథేశ్వర్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా వస్తున్న సినిమా కెప్టెన్ మిల్లర్. వరల్డ్ వార్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన పోసర్లు, గ్లింప్స్, టీజర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈసినిమా పొంగల్ బరిలో దిగనుండగా ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా ఫస్ట్ సింగిల్ ను నేడు రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ పాటను రిలీజ్ చేశారు మేకర్స్. కిల్లర్ కిల్లర్ అంటూ వచ్చే ఈపాట అయితే ఆకట్టుకుంటుంది. హేమ చంద్ర ఈ పాటను ఆలపించాడు.
కాగా ఈసినిమాలో హీరోయిన్ గా ప్రియాంక మోహన్ నటిస్తుండగా.. సందీప్ కిషన్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను సత్య జ్యోతి ఫిలిమ్స్ బ్యానర్‌పై సెంథిల్ త్యాగరాజన్, ఆర్జున్ త్యాగరాజన్ నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీని.. నాగూరన్ ఎడిటింగ్‌ను నిర్వహిస్తున్నారు. ఈసినిమా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: