టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవలే ‘భగవంత్ కేసరి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కోసం ఆమె తొలిసారిగా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణతో జోడీకట్టింది. దసరా పండుగ సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న ఆమె ప్రస్తుతం ‘సత్యభామ’ అనే ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది. కాగా ఇది కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తోన్న 60వ సినిమా కావడం గమనార్హం. ఇందులో కాజల్‌తో పాటు ప్రకాష్‌రాజ్, నవీన్‌చంద్ర కీలక పాత్రలు పోషిస్తోన్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ను ఇచ్చారు మేకర్స్. త్వరలోనే ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీపావళి కానుకగా నవంబర్ 10న ‘సత్యభామ’ టీజర్‌ను రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో హీరోయిన్ కాజల్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో కాజల్ రివాల్వర్ పట్టుకొని ఇంటెన్స్ లుక్‌లో కనిపిస్తోంది. ఇక ‘సత్యభామ’ పోస్టర్ బ్యాక్‌గ్రౌండ్‌లో ముంబై టూ ఒడిశా రూట్ మ్యాప్ కనిపించడం ఆసక్తిని కలిగిస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తోంది. ఈ మూవీకి సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తుండగా.. ‘గూఢచారి’ ఫేమ్ శశికిరణ్ తిక్కా స్క్రీన్‌ప్లేతో పాటు ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్నాడు. కాగా కాజల్ అగర్వాల్ ఇతర సినిమాల విషయానికొస్తే.. ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ‘ఇండియన్ 2’లో కమల్‌హాసన్ సరసన హీరోయిన్గా నటిస్తోంది.
#Satyabhama teaser out on November 10th 💥@MSKajalAggarwal @AurumArtsoffl @sumanchikkala @sashitikka @SriCharanpakala @bobytikka @kalyankodati @KumarTV5Cinema @RekhaBoggarapu @rajivwords @GskMedia_PR pic.twitter.com/PDo2xG16hc
— Suresh PRO (@SureshPRO_) November 8, 2023
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: