కమల్ హాసన్ బర్త్ డే సెలెబ్రేషన్స్.. ఒకే ఫ్రేమ్‌లో సందడి చేసిన సూపర్ స్టార్స్

Kamal Haasan's Birthday Celebrations Super Stars Shivanna, Aamir Khan, Suriya and Vishnu Vishal in Single Frame

‘ఉలగనాయగన్’ కమల్ హాసన్ బర్త్ డే సెలెబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. మంగళవారం చెన్నైలో జరిగిన ఈ వేడుకలో భారతీయ చిత్ర పరిశ్రమలోని వివిధ భాషలకు చెందిన పలువురు సూపర్ స్టార్స్ హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి ప్రముఖ నిర్మాత అశ్వనీ దత్ మరియు ఆయన కుమార్తెలు ఈ సెలెబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్, శాండల్ వుడ్ నుంచి శివన్న (శివ రాజ్ కుమార్), మాలీవుడ్ నుంచి దుల్కర్ సల్మాన్ హాజరవగా.. అలాగే కోలీవుడ్ నుంచి స్టార్ హీరోలు విజయ్, సూర్య, జయం రవి, శివ కార్తికేయన్, విష్ణు విశాల్ తదితరులతో పాటు సీనియర్ నటి ఖుష్బూ, సీనియర్ హీరో ప్రభు మరియు ఆయన కుమారుడు యంగ్ హీరో విక్రమ్ ప్రభు పాల్గొన్నారు. ఇంకా ప్రముఖ తమిళ దర్శకులు లోకేష్ కనగరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్, విఘ్నేష్ శివన్ కూడా కమల్ జన్మదిన వేడుకకు హాజరై సందడి చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా.. కమల్ హాసన్ సినిమాల విషయానికొస్తే ఆయన ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న ‘ఇండియన్ 2’, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ‘థగ్ లైఫ్’.. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తోన్న ‘కల్కి 2898AD’ సినిమాలలో నటిస్తున్నారు. ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కమల్ హాసన్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక వీటితో పాటుగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో ‘విక్రమ్ 2’ మరియు హెచ్ వినోద్ దర్శకత్వంలో ‘KH 233’ వంటి భారీ చిత్రాలలో నటిస్తున్నారు.

కాగా 1987లో వచ్చిన ‘నాయకుడు’ తర్వాత కమల్ మరోసారి మణిరత్నంతో కలిసి పనిచేయనుండటం విశేషం. ‘థగ్ లైఫ్’లో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, స్టార్ హీరోయిన్ త్రిష, ప్రముఖ తమిళ నటుడు జయం రవి తదితరులు నటిస్తున్నారు. రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్ బ్యానర్స్‌పై కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్, మణిరత్నం, శివ అనంత్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్‌పై ఉదయనిధి స్టాలిన్ సమర్పించనున్నారు. ఇక ఈ సినిమాకు ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తుండగా.. రవి కె చంద్రన్ సినిమాటోగ్రఫీ, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × five =