నటసింహం నందమూరి బాలకృష్ణ మాత్రం గ్యాప్ లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ.. రిలీజ్ చేస్తూ వెళుతున్నాడు. ఇప్పటికే వరుసగా అఖండ, వీరసింహారెడ్డి రీసెంట్ గా భగవంత్ కేసరి ఇలా మూడు హిట్లతో బ్లాక్ బస్టర్ హిట్ల ను అందుకున్నాడు. ఇక ఈసినిమా రిలీజ్ అయి ఇంకా నెలరోజులు కాకముందే ఇప్పుడు మరో సినిమాను మొదలుపెట్టేశాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
బాబి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా కొత్త సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమాను ఇటీవలే గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో లాంచ్ చేశారు. ఇక ఇప్పుడు తాజాగా ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా తెలియచేసింది. ఈసందర్భంగా ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈసినిమా కూడా ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండబోతున్నట్టు అర్థమవుతుంది.
Lights Camera Action 🪓👓
Blood Bath Ka Brand Name 🩸
Violence Ka Visiting Card 🔥Natasimham #NandamuriBalakrishna garu & @dirbobby’s #NBK109 Shoot Begins from today! 😎#NBK109ShootBegins 💥@vamsi84 #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/goKhCAHbdK
— Naga Vamsi (@vamsi84) November 8, 2023
కాగా శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈసినిమాలో నటీంచే నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: