దీపావళి కి వచ్చేస్తున్న కాజల్ సత్యభామ టీజర్

kajal aggarwal satyabhama movie teaser release update

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ పెళ్లి తరువాత మళ్లీ తన సినిమాలతో బిజీ అయిపోయింది. రీసెంట్ గానే భగవంత్ కేసరి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తుంది. ఆయితే మొదటిసారి లేడీ ఒరియెంటెండ్ సినిమాతో వస్తుంది. సత్యభామ అనే టైటిల్‌ తో ఈసినిమా వస్తుంది. ఇందులో కాజల్ ఏసీపీ సత్యభామ అనే పవర్‌‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌‌గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటుంది. ఇక కాజల్ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. దీపావళికి ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. కాగా అఖిల్ డేగల ఈసినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శశికిరణ్ తిక్క స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు. శశికిరణ్ తిక్క సమర్పణలో ఆయన సోదరుడు బాబి తిక్క, తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 5 =