సప్త సాగరాలు దాటి సైడ్‌-బి ట్రైల‌ర్ వచ్చేస్తోంది

Sapta Sagaralu Dhaati Side-B Trailer To be Released Today Evening

‘777 చార్లీ’ సినిమాతో తెలుగులో కూడా పాపులర్ అయిన కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ కన్నడ మూవీ ‘సప్త సాగరదాచే ఎల్లో: సైడ్‌-ఏ’. ఈ మూవీలో రక్షిత్‌ శెట్టి సరసన రుక్మిణి వసంత్ కథానాయికగా నటించారు. లవ్ స్టోరీ నేపథ్యంలో ఫీల్ గుడ్ మూవీగా రూపొందిన ఈ చిత్రానికి యూత్ ఎక్కువగా కనెక్ట్ అయ్యారు. దీనికితోడు చరణ్ రాజ్ అందించిన మ్యూజిక్ సినిమాకు బాగా ప్లస్ అయింది. దీంతో ఇటీవలి కాలంలో ఇలాంటి ప్రేమ కథ రాలేదని కన్నడనాట ప్రేక్షకులు కితాబునివ్వడం గమనార్హం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ క్రమంలో కన్నడనాట యువతరాన్ని ఉర్రుతలూగించిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని తెలుగులో ‘సప్త సాగరాలు దాటి’ పేరుతో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థ తెలుగులో సెప్టెంబర్ 22న విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా హేమంత్ ఎం రావు దర్శకత్వం వహించిన ‘సప్త సాగరదాచే ఎల్లో’ రెండు భాగాలుగా రూపొందింది. ఇక తొలి పార్ట్ హిట్ అవ్వడంతో సీక్వెల్ ఎప్పుడు విడుదల అవుతుందా అని అటు కన్నడ ప్రేక్షకులతో పాటు ఇటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ సినీ ప్రియులను ఆకట్టుకుంది. నవంబర్ 17న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేక‌ర్స్ సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.

ఇక విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర పడుతున్న నేపథ్యంలో మూవీ నుంచి మేక‌ర్స్ మ‌రో సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ మూవీ ట్రైల‌ర్‌ను ఈరోజు (న‌వంబ‌ర్ 04, 2023) సాయంత్రం 6:06 గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు రక్షిత్ శెట్టి తెలిపారు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియాలో తెలుపుతూ.. ”క్యాసెట్‌ను తిప్పడానికి సిద్ధంగా ఉండండి” నవంబర్ 4న సప్త సాగరదాచే ఎల్లో సైడ్ -బి ట్రైలర్ వ‌స్తుంది” అంటూ రక్షిత్ శెట్టి పేర్కొన్నారు. కాగా ఈ సినిమాను హీరో రక్షిత్‌ శెట్టి తన స్వంత బ్యానర్‌పై నిర్మించడం విశేషం. అలాగే గుండు శెట్టి సహ రచయితగా వ్యవహరించగా.. అద్వైత గురుమూర్తి ఛాయాగ్రహణం అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.