లియో థియేట‌ర్‌ వద్ద సందడి చేసిన లోకేష్‌, అనిరుధ్‌.. వీడియో వైర‌ల్

Lokesh Kanagaraj and Anirudh Ravichander Visit Vettri Theatre in Chennai To Watch Leo

కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘లియో’. క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ వహించిన ఈ చిత్రం గురువారం (అక్టోబర్ 19, 2023) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాలో త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా న‌టించగా.. బాలీవుడ్ ప్రముఖ నటులు సంజ‌య్‌ ద‌త్ మరియు బాబీ డియోల్ కీల‌క పాత్ర‌లు పోషించారు. కాగా ‘విక్రమ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ నుంచి వస్తున్న మూవీ కావడంతో ‘లియో’ మీద అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. భారతీయ చలచిత్ర పరిశ్రమలోనే తొలిసారిగా లోకేష్ సినిమాటిక్ యూనివ‌ర్స‌ల్‌ (ఎల్‌సీయూ) అనే కాన్సెప్టుతో సినిమాలు తీస్తూ ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ చిత్రాన్ని 7 స్క్రీన్ స్టూడియోపై ఎస్ ఎస్ లలిత్ కుమార్ నిర్మించగా.. జగదీష్ పళనిసామి సహనిర్మాతగా వ్యవహరించారు. ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా ఈరోజు ‘లియో’ సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో.. థియేటర్‌ల‌ వద్ద డప్పులు, బ్యాండ్‌ వాయిస్తూ, డ్యాన్సులు చేస్తూ.. పటాకులు పేల్చుతూ విజయ్‌ ఫ్యాన్స్‌ సందడి చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. మరోవైపు ‘లియో’ మూవీ టీమ్ అభిమానులతో కలిసి లియో సినిమా చూసేందుకు థియేటర్‌కు వచ్చింది. ద‌ర్శ‌కుడు లోకేశ్‌ కనగరాజ్‌, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ చెన్నైలోని వెట్రి థియేటర్‌కు విచ్చేశారు. దీంతో దళపతి అభిమానులు వారిని చుట్టుముట్టి కేరింతలు కొట్టారు. ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

అయితే త‌మిళనాడులో ‘లియో’ ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షోకు అనుమతి లేకపోవడంతో ఉదయం 9 గంటల షోలకు అభిమానులు పోటెత్తారు. ఇంకోవైపు ఏపీ, తెలంగాణ, కేరళ, కర్ణాటక రాష్ట్రాలతో పాటు అమెరికా, సింగపూర్, మలేషియా సహా మొత్తం 34 దేశాల్లో ‘లియో’ విడుదలైంది. ఇక భారీ అంచనాలతో గ్రాండ్‌గా విడుదలైన ఈ మూవీకి ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి ఓపెనింగ్స్ నమోదయ్యాయి. అమెరికా, యూకే, దుబాయ్ దేశాల్లో ‘లియో’ భారీ వసూళ్లు చేస్తోంది.

కాగా ఈ సినిమాకి వచ్చిన అడ్వాన్స్ బుకింగ్ ద్వారా తొలి రోజే రూ.50 కోట్ల షేర్, 100 కోట్ల గ్రాస్ మార్కును చేరుకోవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక లియోకి సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది. విజయ్ ఎక్సలెంట్ ఫెర్ఫార్మెన్స్, అనిరుధ్ ఇచ్చిన బీజీఎం నెక్స్ట్ లెవెల్ అని పోస్టులు పెడుతున్నారు. వచ్చే మూడు రోజులూ వీకెండ్ కానుండటం, మరోవైపు దసరా సెలవులు కలిసి రావడంతో ‘లియో’ కలెక్షన్ల సునామీ ఖాయమని అంచనా వేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =