తన తొలి రెండు చిత్రాలు ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ బ్లాక్ బస్టర్ విజయాలతో అందరి ప్రసంశలు అందుకున్న యంగ్ అండ్ ట్యాలెంటడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ ఇప్పుడు మూడో చిత్రంగా క్రైమ్ కామెడీ మూవీ ‘కీడా కోలా’తో వస్తున్నారు. ఈసినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఇప్పటికే విడుదలైన క్యారెక్టర్ పోస్టర్లు, టీజర్ ఈ సినిమాపై మంచి బజ్ ని క్రియేట్ చేశాయి. ఇక తాజాాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. రానా దగ్గుబాటి ఈ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న రానా మాట్లాడుతూ.. తాము అనుకున్న కథని బలంగా నమ్మి, కథకు కథనానికి కట్టుబడి సినిమాలు తీసే ఫిల్మ్ మేకర్స్ చాలా అరుదుగా వుంటారు. తరుణ్ భాస్కర్ కూడా లాంటి అరుదైన దర్శకుడు. ఒరిజినల్ సినిమాలు చేసే తరుణ్ భాస్కర్ లాంటి ఫిల్మ్ మేకర్ తెలుగు పరిశ్రమలో వుండటం ఒక గౌరవంగా భావిస్తాను. కీడా కోలా చిత్రాన్ని తరుణ్ చూపించినపుడు చాలా నవ్వుకున్నాను. ప్రేక్షకుల కూడా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం వుంది. తరుణ్ సినిమాల్లో ఎప్పుడూ చూడని కొత్త నటీనటులని ఇందులో చాలా కొత్తగా చూస్తున్నాం. నవంబర్ 3న సినిమా వస్తోంది. సినిమా చూడండి. తప్పకుండా ఎంజాయ్ చేస్తారు అని అన్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























