టాలీవుడ్ లోని స్టార్ హీరోలలో మెగా మేనల్లుడు, టాలీవుడ్ సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన.. అనంతరం స్వయంకృషితో అచిరకాలంలోనే తనకంటూ స్పెషల్ స్టార్డమ్ సంపాదించుకున్నారు. కాగా 1986 అక్టోబర్ 15 న జన్మించిన సాయిధరమ్ తేజ్ కి నిన్నటితో 36 ఏళ్ళు నిండాయి. ఈ సందర్భంగా ఆయన గొప్ప మనసు చాటుకున్నారు. మన సమాజం, అలాగే మన దేశ పౌరుల భద్రత కోసం నిరంతరం తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పోరాడే సైనికులు మరియు పోలీసుల క్షేమం కోసం భారీ విరాళాలు అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సాయిధరమ్ తేజ్ జన్మదినం సందర్భంగా.. భారత సైన్యం కోసం 10 లక్షలు విరాళం ప్రకటించారు. అలాగే రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసు అకాడమీలకు చెరొక 5 లక్షలు విరాళం ఇచ్చారు. కాగా గత సంవత్సరం, పేదరికంలో ఉన్న ఒక వృద్ధ మహిళ పక్కా ఇల్లు కోసం సాయిధరమ్ తేజ్ విరాళమిచ్చిన విషయం తెలిసిందే. ఇక ‘రిపబ్లిక్’ వంటి మంచి అర్థవంతమైన సినిమాలలో నటించి ప్రేక్షకుల మన్ననలు పొందిన పొందారు తేజ్. అలాగే ఇటీవల ‘ది సోల్ ఆఫ్ సత్య’ అనే షార్ట్ ఫిల్మ్‌లో సైనికుడిగా నటించడం కూడా తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం సాయిధరమ్ తేజ్.. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కనున్న “గాంజా శంకర్” అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో నటించనున్నారు. ఈ క్రమంలో ఆయన బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ హై విడుదలైంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























