శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా ఈసినిమా వస్తుంది. యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. అంతేకాదు వెంకటేష్ కెరీర్ లో వస్తున్న 75వ సినిమా కావడంతో ఈసినిమాకోసం వెంకీ ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసినిమా కూడా సంక్రాంతి బరిలో దిగనుంది. జనవరి 13వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా ప్రమోషన్స్ ను అప్పుడే మొదలుపెట్టారు మేకర్స్. ఇప్పటికే ఈసినిమానుండి పలు పోస్టర్లను రిలీజ్ చేయగా.. ఇప్పుడు తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ అయితే ఆకట్టుకుంటుంది. వెంకీ మాస్ అవతార్ తో మరోసారి అలరించనున్నాడు. విజువల్స్ ఇంకా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది.
కాగా ఈసినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. ఎస్ మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. నిహారిక ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈసినిమాకు కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత సైంధవ్ పాన్ ఇండియా చిత్రంగా అన్ని దక్షిణాది భాషలు, హిందీలో విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























