బిగ్ బాస్7- సత్తా చూపిన ఆటగాళ్లు..కెప్టెన్ గా ప్రిన్స్

bigg boss season 7 telugu day 40 highlights

మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 7 లో ఆరో వారం కూడా ఎండింగ్ కూడా వచ్చేసింది. కొత్తగా వచ్చిన ఐదుగురు కంటెస్టెంట్స్ ప్రస్తుతం హౌస్ కూడా సందడిగా ఉంది. ఇక ప్రస్తుతం హౌస్లో కెప్టెన్సీ కోసం పోటీ జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. కొత్తగా వచ్చిన కంటెంస్టెంట్లను పోటుగాళ్లుగా .. పాత వాళ్లను ఆటగాళ్లుగా పెట్టి డివైడ్ చేసి పలు టాస్కులు ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో గురువారం ఆట ముగిసే సమయానికి ఆటగాళ్లకు 3పాయింట్లు.. పోటుగాళ్లకు 3పాయింట్లు రావడంతో టై అయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక శుక్రవారం ఎపిసోడ్ లో హూ ఈజ్ బెస్ట్ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో ఒక బంతిని ఇవ్వగా దాన్ని చేత్తో పట్టుకొని గోల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ టాస్క్ లో రెండు టీమ్స్ బాగానే కష్టపడగా ఆటగాళ్ల టీమ్ మాత్రం గెలిచింది. ఫైనల్ గా ఆటగళ్ల టీమ్ కెప్టెన్సీ కోసం పోటీపడనున్నారు.

ఇదిలా ఉండగా ఇక్కడ కూడా బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఇచ్చాడు. ఆటగాళ్లలో ఎవరు కెప్టెన్ అవ్వాలో పోటుగాళ్ల టీమ్ డిసైడ్ చేస్తుంది. ఆటగాళ్లకు బెలూన్స్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక పోటుగాళ్లలో ఒక్కొక్కరూ వచ్చి ఆటగాళ్లలో ఒకరికి సూది ఇవ్వాలి.. ఆ సూదితో మరొకరి బెలూన్ పగలకొట్టాలి ఆటగాళ్లు.. ఇలా ఫైనల్ గా ప్రిన్స్ ఆ టాస్క్ లో గెలుస్తాడు. దీంతో హౌస్ లో రెండో కెప్టెన్ గా నిలుస్తాడు ప్రిన్స్.

మరి ఈ వారం నామినేషన్ లోకి శోభాశెట్టి, తేజ, అమర్ దీప్, అర్జున్, నయని పావని, అశ్విని, పూజా మూర్తి వచ్చారు. వీరిలో ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారో అన్న విషయం తెలియాలంటే మాత్రం రేపటివరకూ వెయిట్ చేయాల్సిందే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − one =