ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది మ్యాడ్ సినిమా. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నార్నె, సంగీత్ శోభన్,రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా వచ్చింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రావడంతో యూత్ ను మాత్రమే కాదు అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఈసినిమా రోజు రోజుకు కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోతుంది. మొదటి రోజు 1.8 కోట్లు కలెక్ట్ చేయగా మంచి టాక్ రావడంతో సెకండ్ డేకు కలెక్షన్స్ మరింత పెరిగాయి . అలా నాలుగు రోజుల్లో 10 కోట్లు.. ఐదు రోజుల్లో 11 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సొంతంచేసుకుంది. ఇక ఈసినిమా రిలీజ్ అయి వారం రోజులు అయిపోయింది. ఈ వారం రోజుల్లో ఈసినిమా 14 కోట్లు కలెక్ట్ చేసింది. ఈవిషయాన్ని చిత్రయూనిట్ స్పెషల్ పోస్టర్ ద్వారా తెలియచేస్తూ సంతోషాన్ని వ్యక్తం చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#MAD grosses over 𝟏𝟒 𝐂𝐑 in 7️⃣ Days, 2nd-weekend starts on HIGH with fast fillings & sold-out shows everywhere! 🔥🥁
Enjoy the #MAD Entertainer of the year at theatres near you with Reduced ticket prices for today on the occasion of #NationalCinemaDay 🥳🥁
🎟 -… pic.twitter.com/JV9BTl3fhw
— Sithara Entertainments (@SitharaEnts) October 13, 2023
కాగా ఈసినిమాలో గౌరీ ప్రియా,అనంతిక,గోపిక ఉదయన్ హీరోయిన్లుగా నటించగా.. మురళీధర్ గౌడ్,రఘు బాబు,విష్ణు తదితరులు పలు కీలకపాత్రల్లో నటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు హారిక, హాసిని ఫిలింస్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై హారిక సూర్య దేవర తొలిసారి నిర్మాతగా, ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగవంశీ సమర్పకుడిగా ఈసినిమాను నిర్మించారు. ఈసినిమాకు సంగీతం.. భీమ్స్ సిసిరోలియో, సినిమాటోగ్రఫి..దినేష్ కృష్ణన్, శ్యామ్ దత్ అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: