దివగంత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి మరణ అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను బేస్ చేసుకొని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నసంగతి తెలిసిందే.ఇది రెండు భాగాలుగా రానుంది.అందులో మొదటి భాగం వ్యూహం కాగా రెండోది శపథం.ఇక ఈరోజు వ్యూహం ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఈ ట్రైలర్ చాలా ఆసక్తిగా వుంది.వైఎస్ఆర్ చనిపోయాక ఆయన తనయుడు వైఎస్ జగన్ సీఎం అవుతారనుకున్నారు కాని కాంగ్రెస్ హై కమాండ్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఆ తరువాత జగన్ కొత్త పార్టీ స్థాపిస్తాడు ఇక అక్కడి నుండి తన రాజకీయ ప్రస్థానం ఎలా సాగింది.బలమైన నాయకుడు చంద్రబాబు నాయుడుని ఏవిధంగా ఎదుర్కున్నాడు.పార్టీని ఏవిధంగా బలోపేతం చేసుకున్నాడు.తను 2019లో అధికారంలోకి రావడానికి పాదయాత్ర ఎలా ఉపయోగపడింది.ఇందులో జగన్ కు అయన సతీమణి వైఎస్ భారతి ఏవిధంగా అండగా నిలిచింది.వీటన్నింటిని వ్యూహంలో చూపెట్టనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక కాస్టింగ్ విషయంలో రామ్ గోపాల్ వర్మను మెచ్చుకోవాల్సిందే.జగన్ గా రంగం ఫేమ్ అజ్మల్ అలాగే భారతి గా మానస ఆ పాత్రలకు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యారు.జగన్ బాడీ లాంగ్వేజ్ ను అజ్మల్ అద్బుతంగా దించాడు.ఓవరాల్ గా ట్రైలర్ అయితే సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చింది.ఎలక్షన్స్ కు ముందు సీరియస్ టోన్ లో వస్తున్న ఈ సినిమా ఏపీ లో పొలిటికల్ హీట్ ను పెంచుతుందనడంలో సందేహం లేదు.బాలాజీ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్నాడు.ఈనవంబర్ 10న విడుదలకానుంది.మరి ఈ వ్యూహం ఎలాంటి రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























