అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు ఓవర్సీస్ రిలీజ్ అప్ డేట్

ambajipeta marriage band movie overseas release update

కలర్ ఫొటో తో హీరోగా మారిన సుహాస్ ఆ సినిమాతోనే మంచి హిట్ ను అందుకోడమే కాకుండా నటుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అప్పటినుండీ డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో సుహాస్ హీరోగా వస్తున్న సినిమా అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఈనేపథ్యంలోనే ఈసినిమా టీజర్ ను ఇప్పటికే రిలీజ్ చేయగా టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. లవ్, కామెడీ తో పాటు ఎమోషనల్ ఉన్న టీజర్ అయితే సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచేసింది. మరోసారి సుహాస్ తన మార్క్ యాక్టింగ్ తో మెప్పించనన్నట్టు అర్థమవుతుంది.

ఇక ఈసినిమా ఓవర్సీస్ రిలీజ్ కు సంబంధించి అప్ డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈ సినిమాను ఓవర్సీస్‌లో పాపులర్ ఓవర్సీస్‌ ఫిల్మ్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఫ్లై హై సినిమాస్ విడుదల చేయనుంది. ఈవిషయాన్ని తెలియజేస్తూ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

కాగా ఈసినిమాలో ఇంకా పుష్ప ఫేమ్ జగదీష్ ప్రతాప్, గోపరాజు, రమణ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక కేరాఫ్ కంచరపాలెం ఫేమ్ మహా వెంకటేష్ అలానే గీతాఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్ని వాసు ఇంకా ధీరజ్ మొగిలినేని కలిసి సంయుక్తంగా నిరిస్తున్నారు. ఈసినిమాకు శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve + seventeen =