బిగ్ బాస్ 7-హవా చూపించిన ఆటగాళ్లు

bigg boss season 7 telugu day 39 highlights

బిగ్ బాస్ 7లో ఆరో వారం కూడా ముగియడానికి వచ్చేస్తుంది. 14మంది కంటెస్టెంట్లతో మొదలైన ఈ సీజన్ లో ఇప్పటికే 5గురు ఎలిమినేట్ అయిపోయారు. ఇప్పుడు మరో ఐదుగురు కొత్త కంటెస్టెంట్ లు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక గౌతమ్ ను సీక్రెట్ రూంలో ఉంచి మళ్లీ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. గౌతమ్ ను కొత్తవాళ్లను కలిపి పోటుగాళ్లుగా.. పాత కంటెస్టెంట్ లను ఆటగాళ్లుగా రెండు కేటగిరీల్లో డివైడ్ చేళారు. ప్రస్తుతం రెండు గ్రూపుల మధ్య కెప్టెన్సీ కోసం పోటీ జరుగుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరోవైపు ప్రశాంత్ కెప్టెన్సీ ని మళ్లీ తిరిగి ఇచ్చేశాడు ప్రశాంత్. బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించట్లేదన్న కారణంతో ప్రశాంత్ కెప్టెన్సీ ని రద్దు చేసిన బిగ్ బాస్ మళ్లీ కెప్టెన్సీని ఇస్తూ ఈసారైనా సరిగ్గా చూసుకోమని చెబుతాడు. అలానే శోభా శెట్టికి కూడా పనిష్ మెంట్ వస్తుంది. రోజులో కేవలం ఏడు వస్తువులు మాత్రమే తాను మేకప్ కిట్ కూడా వాడటంతో పనిష్మెంట్ ఇవ్వాలని అంటాడు బిగ్ బాస్. దీంతో అర్జున్ మూడు రోజులు తేజ వేసుకున్న షర్ట్ వేసుకోవాలని చెబుతాడు. అక్కడ కాసేపు కామెడీ చేశారు శోభా శెట్టి, తేజ.

గత రెండు రోజుల నుండి హూ ఈజ్ బెస్ట్ అనే టాస్కులో భాగంగా నాలుగు గేమ్స్ ను పెట్టగా వాటిలో మూడు పోటుగాళ్లు గెలవగా..ఒకటి ఆటగాళ్ల టీమ్ గెలిచింది. ఇక నిన్న కూడా కొన్ని టాస్కులు ఇచ్చాడు బిగ్ బాస్. ముందుగా సినిమా నాలెడ్జ్ కు సంబంధించిన గేమ్ ను పెట్టాడు. ఈ టాస్క్ లో కొన్ని డైలాగ్స్ లు పెట్టి అందులో ఉపయోగించిన ఆయుధాలు ఏంటి అని అడుగుతాడు. పాటలు ప్లే చేస్తూ అందులో హీరో హీరోయిన్లు ఎవరు అని అడుగుతాడు. వాటికి కంటెస్టెంట్లు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది.

ఇక ఈ టాస్క్ లో కూడా శోభా శెట్టి కాస్త హడావుడి చేసింది. బోర్డులు దాటిపెట్టేస్తుంది. మిర్చి మిర్చి సాంగ్ ప్లే చేయగా.. అందులో మొత్తం ఎన్ని మిర్చీలు ఉన్నాయ్ అని బిగ్ బాస్ అడగగా ఈనేపథ్యంలో శోభా. 9, 13 ఉన్న బోర్డ్‌లను రెండూ పట్టుకుని నిలబడింది. దీంతో గౌతమ్ బిగ్ బాస్.. మళ్లీ రెండు బోర్డ్‌లు పట్టుకుంది.. లాక్కోవాలా? అని అడిగితే.. లాక్కో అంటూ రచ్చ చేసింది. పైనల్ గా ఈ టాస్క్ లో ఆటగాళ్లు గెలిచారు. రెండో గేమ్ లో ఎవరు ఫోకస్ అనే టాస్క్ ఇస్తాడు. ఈ టాస్క్ లో కూడా ఆటగాళ్ల టీమ్ గెలుస్తుంది. ఫైనల్ గా పోటుగాళ్ల టీమ్ 3 పాయింట్లు.. ఆటగాళ్ల టీమ్ మూడు పాయింట్లతో టై అవుతుంది. మరి బిగ్ బాస్ నెక్ట్స్ ఎలాంటి టాస్క్ ఇస్తాడు.. అందులో ఎవరి గెలిచి కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారు అనేది చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 2 =