అకీరా కు హీరో అవ్వడం ఇష్టంలేదు- రేణు దేశాయ్

renu desai clarity on akira nandan tollywood entry

పవన్‌కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక తండ్రికి తగ్గ తనయుడు లాగా అకీరా కూడా పవన్ లాగానే చాలా సైలెంట్. బయట కూడా ఎప్పుడో ఒకసారి కనిపిస్తాడు. ఇక అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫొటోలు కానీ, వీడియోలు కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇక ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గా అకీరా నందన్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. రైటర్స్ బ్లాక్‌ అనే ఒక షార్ట్ ఫిల్మ్ కి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరోవైపు అకీరా హీరోగా ఎప్పుడు ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తాడా అని ఎదురుచూస్తున్నారు. ఆమధ్య పలు వార్తలు కూడా వచ్చాయి. అయితే రేణూ దేశాయ్ మొదటి నుండీ అకీరాకు హీరో అవ్వాలనే ఇంట్రస్ట్ లేదు అని చెబుతూనే వస్తుంది. ఇక మరోసారి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేసింది రేణూ దేశాయ్. అకీరా చాలా కామ్ గా ఉంటాడు.. బయట కూడా ఎక్కువ కనిపించడు.. తను యోగా, కిక్ బాక్సింగ్, ప్రాణాయామం ఇలా వేరే ట్రాక్ లో ఉన్నాడు. తనకు యాక్టింగ్ అంటే ఇష్టంలేదు.. ఈ విషయం నేను చాలా సార్లు చెప్పాను.. ప్రస్తుతం ఈక్షణం వరకూ తనకు యాక్టింగ్ అంటే ఇష్టంలేదు.. హీరో అవ్వడం ఇష్టంలేదు. ప్యూచర్ లో కనుకు తను మైండ్ మార్చుకుంటే నేనే నా ఇన్ట్సా ద్వారా చెపుతాను. తను ఇంతవరకూ ఎలాంటి ప్రాజెక్ట్ కు సైన్ చేయలేదు.. ఎవరూ ప్రొడ్యూస్ చేయడంలేదు.. ఇప్పటికైతే అకీరా యాక్ట్ చేయడంలేదు అంటూ క్లారిటీ ఇచ్చేసింది. మరి అకీరా ఇండస్ట్రీ ఎంట్రీ గురించి ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ కు ఇది కాస్త బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు..

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.