తమిళ్ స్టార్ హీరో విశాల్ సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గా మార్క్ ఆంటోని సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగ ఇప్పుడు మరో సినిమాతో బిజీ అయిపోయాడు. హరి దర్శకత్వంలో విశాల్ హీరోగా ఒక సినిమా వస్తుంది. భరణి, పూజా సినిమాల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి ఒక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. స్టంట్ మాస్టర్ కణల్ కణ్ణన్ తో తమిళనాడులోని తొట్టికూడులో ఇంటెన్స్ క్లైమాక్స్ షూట్ జరుగుతుందని సెట్ లో దిగిన ఫొటోను పోస్ట్ చేస్తూ తెలిపాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#Vishal34 – Intense climax shoot in progress with stunt master #KanalKannan, in Tuticorin. @VishalKOfficial #Hari @stonebenchers @ZeeStudiosSouth #InvenioOrigin @karthiksubbaraj @priya_Bshankar @kaarthekeyens #AlankarPandian @Kirubakaran_AKR @thevinothcj @onlynikil pic.twitter.com/3BB0hVrcSg
— Stone Bench (@stonebenchers) October 13, 2023
కాగా మాస్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈసినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ అలాగే స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ వారు సంయుక్తంగా నిర్మించనున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈసినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈసినిమాలో నటించే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: