కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసత్వంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు మంచు విష్ణు. కెరీర్ మొదట్లో మంచి హిట్లనే అందుకున్న మోహన్ బాబు ఆ తరువాత మాత్రం సరైన విజయాలను అందుకోలేకపోయాడు. అయితే ప్రస్తుతం కొత్త కొత్త హీరోలు వస్తుండటం.. కాంపిటీషన్ ఎక్కువవడంతో కాస్త వెనుకపడ్డాడు విష్ణు. ఇక చాలా గ్యాప్ తరువాత ఇప్పుడు ఓ భారీ కథతో వచ్చేస్తున్నాడు. కన్నప్ప అనే సినిమాను తీస్తున్నాడు. మహాభారత్ సిరీస్‌కి దర్శకత్వం వహించిన ముఖేష్ కుమార్ సింగ్ ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాలో పెద్ద పెద్ద స్టార్లు అందరూ జాయిన్ అవుతున్నారు. ఈసినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎంట్రీ తోనే ఒక్కసారిగా టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది. ఇక ప్రభాస్ తో పాటు నయనతార, మోహన్ లాల్ కూడా ఈసినిమాలో నటిస్తున్నారు. అంతేకాదు అప్పుడే మహాశివుడి పాత్రలో ప్రభాస్, పార్వతీ దేవిగా నయనతార నటించనున్నారన్న వార్తలు కూడా తెరపైకి వచ్చాయి. ఇప్పుడు మరో స్టార్ హీరో ఈ సినిమాలో జాయిన్ అయినట్టు తెలుస్తుంది. ఆ స్టార్ హీరో ఎవరో కాదు కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్. ఈయన కూడా ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.
🔱DAMRU DAM DAM🔱
It is a Great Honour for us to have @NimmaShivanna Sir joining the #Kannappa Movie.
🔆Another comeback where the wise awakens🔆
.
.
He is everything & everything.
He is the universe …🙏🏻
🔱#HarHarMahaDev🔱Stay tuned for more updates!💯#ATrueIndianEpicTale https://t.co/3m0UFCNveu
— 24 Frames Factory (@24FramesFactory) October 12, 2023
కాగా ఈసినిమాను అవా ఎంటర్టైన్మెంట్ ఇంకా 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మంచు విష్ణు తండ్రి, సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. మణిశర్మ, స్టీఫెన్ దేవాసి సంయుక్తంగా ఈసినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: