బిగ్ బాస్ 7- ఫస్ట్ కెప్టెన్ గా రైతు బిడ్డ

bigg boss 7 telugu pallavi prashanth as first captain in the house

బిగ్ బాస్ 7 హౌస్ లో 5వ వారం కూడా పూర్తికావస్తుంది. ఇక ఈవారం హౌస్ లో కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ పోటీ పెట్టిన సంగతి తెలిసిందే కదా. ఎవరైతే ఈ వారం కెప్టెన్సీ టాస్క్ గెలుస్తారో వారికి ఈ వారంతో పాటు నెక్ట్స్ వీక్ కూడా ఇమ్యూనిటీ ఉంటుంది. దీంతో కెప్టెన్సీ కోసం హౌస్ మేట్స్ కూడా చాలా గట్టిగానే ప్రయత్నించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక బిగ్ బాస్ చిట్టి ఆయిరే అనే టాస్క్ ను పెట్టిన సంగతి తెలిసిందే కదా. ఈటాస్క్ మధ్యలోనే ఎపిసోడ్ పూర్తవ్వగా నిన్న అక్కడినుండే మొదలైంది. అమర్ దీప్- సందీప్ జంటను పిలవగా.. అమ్మ హెల్త్ ఎలా ఉందో తెలుసుకోవాలని ఉందని సందీప్ అనగా.. తన భార్య పేరు విని చాలా రోలులైంది అని ఇద్దరూ ఎమోషనల్ అయ్యారు. అయితే ఫైనల్ గా అమర్ దీప్ త్యాగం చేయడంతో సందీప్ కు లెటర్ తో పాటు కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. ఆ తరువాత ప్రశాంత్-శివాజీ ని పిలవగా వీరిద్దరిలో శివాజీ త్యాగం చేయడంతో ప్రశాంత్ కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు.

ఫైనల్ గా రెండు రోజుల్లో జరిగిన టాస్క్ ల్లో ఆడి తేజ, సందీప్, ప్రశాంత్, గౌతమ్ కెప్టెన్సీ పోటీకి కంటెండర్లు అయ్యారు. వీరికి ఫైనల్ టాస్క్ గ్ రంగు పడుద్ది రాజా అనే గేమ్ పెట్టాడు బిగ్ బాస్. గత సీజన్లు చూసిన వారికి ఈ గేమ్ గురించి ఐడియా ఉండే ఉంటుంది. ఒక సర్కిల్ ఉంటుంది.. ఆ సర్కిల్ లోపల పోటీదారులు నిలబడి ఒకరి టీ షర్ట్ పై మరొకరు చేతితో రంగును పూయాల్సి ఉంటుంది. ఇక ఎండ్ బజర్ కొట్టేలోపు ఎవరి షర్ట్ కు తక్కువ రంగు ఉంటుందో వారు గెలిచినట్టు. ఈ టాస్క్ లో ప్రశాంత్ మరోసారి తన సత్తా చూపించాడు. అందరి కంటే రంగు తక్కువ పూయించుకొని హౌస్ లో మొదటి కెప్టెన్ అయ్యాడు.

గేమ్ స్టార్ట్ అయి ఎవరికి వారు రంగు పూయాలని ప్రయత్నిస్తున్న తరుణంలో సందీప్ షర్ట్ ను లాగేస్తాడ్ ప్రశాంత్. దీంతో ప్రశాంత్ పై సీరియస్ అవుతాడు సందీప్. అంతేకాదు మొహంపై కొట్టాడు అని కూడా అనడంతో ఆ గొడవ కాస్త పెద్దదైంది. దీంతో ఈ టాస్క్ కు సంచాలకురాలిగా ఉన్న ప్రియాంక సర్దిచెప్పడంతో గొడవకాస్త సద్దుమణిగింది. ఇక టాస్క్ లో మొదటగా తేజ బయటకు వెళ్లగా.. రెండో రౌండ్ లో సందీప్ గేమ్ నుండి ఆవుట్ అయ్యాడు. ఆ తరువాత గౌతమ్-ప్రశాంత్ పోటీ పడగా.. ఇద్దరిలో ప్రశాంత్ గెలిచి కెప్టెన్ అయ్యాడు. అలా శుక్రవారం ఎపిసోడ్ ముగుస్తుంది. మరి వీకెండ్ వచ్చేసింది. ఈ వారం ఎవరికి క్లాస్ లు ఎవరికి పొగడ్తలు.. ఎవరు ఇంటి నుండి వెళతారో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 3 =