మ్యాడ్ మూవీ ట్రైలర్‌ను లాంచ్ చేసిన జూ.ఎన్టీఆర్

Jr NTR Launched Mad Movie Theatrical Trailer

టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావ‌మ‌రిది నార్నే నితిన్ హీరోగా న‌టిస్తోన్న మూవీ ‘మ్యాడ్’. ప్రముఖ దర్శకుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ స‌తీమ‌ణి సాయి సౌజ‌న్య మరియు టాప్ ప్రొడ్యూసర్ రాధాకృష్ణ (చినబాబు) కుమార్తె, నిర్మాత నాగ‌వంశీ సోద‌రి హారిక సూర్యదేవర కలిసి ఈ మూవీని నిర్మిస్తుండటం విశేషం. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని నాగవంశీ సమర్పిస్తున్నారు. ఇంజినీరింగ్ కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక సినిమా అక్టోబర్ 6వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను ముమ్మురం చేసింది చిత్రబృందం. ఈ క్రమంలో తాజాగా ‘మ్యాడ్’ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది. మంగళవారం ఉదయం ఈ సినిమా ట్రైలర్‌ను స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ చేతులమీదుగా లాంఛ్ చేశారు. తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్‍లో ఈ ట్రైలర్‌ను 10:18 గంటలకు ఎన్టీఆర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. “సినిమా వైబ్ నచ్చింది. మ్యాడ్ ట్రైలర్ నవ్వులు కురిపిస్తోంది. నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ అద్భుతంగా నటించారు. అక్టోబర్ 6న సినిమా విడుదల చేయనున్న నేపథ్యంలో దర్శకుడు కళ్యాణ్ శంకర్ మరియు నా సోదరుడు వంశీకి ఆల్ ది బెస్ట్” అని తెలిపారు.

కాగా మ్యాడ్ సినిమాలో నార్నే నితిన్‌తో పాటు సంగీత్ శోభ‌న్‌, రామ్ నితిన్ కూడా హీరోలుగా న‌టిస్తోన్నారు. అలాగే శ్రీ గౌరి ప్రియారెడ్డి, అనంతిక సునీల్‌ కుమార్‌, గోపికా ఉద్యాన్ హీరోయిన్లుగా చేస్తున్నారు. ఇక మ్యాడ్’ మూవీ ట్రైలర్‌ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. తొలిసినిమా అయినా.. నార్నే నితిన్ మంచి ఈజ్ తో కనిపించాడు. ఫుల్ ఫన్ ఎంట‌ర్‌టైనర్ గా సినిమా ఉండబోతున్నట్లు చూస్తుంటేనే అర్ధమవుతుంది. కాలేజ్‌గ్యాంగ్స్‌, సీనియర్స్ అండ్ జూనియర్స్ మధ్య ర్యాగింగ్‌, ప్రేమలు, గొడవలు.. ఇలా ఓ మాంచి రోలర్‌ కోస్టర్‌ రైడ్‌లా సినిమా ఉండనుందని తెలుస్తోంది.

కాగా మరోవైపు మ్యాడ్ సినిమా కచ్చితంగా హిట్ కొడుతుందని మేకర్స్ ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఇటీవల నిర్వహించిన ఈవెంట్‍లోనూ ఈ మేరకు నాగవంశీ ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పారు. జాతిరత్నాలు చిత్రం కంటే మ్యాడ్ సినిమా ఎక్కువగా నవ్విస్తుందని ఆయన చెప్పారు. రిలీజ్‍కు ముందే స్పెషల్ ప్రీమియర్స్ కూడా ప్రదర్శించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ‘బలగం’ ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ఇదిలా ఉండగా.. నార్నే నితిన్ హీరోగా న‌టించిన ‘శ్రీశ్రీశ్రీ రాజావారు’ మూవీ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు ‘శతమానం భవతి’ ఫేమ్ స‌తీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అలాగే టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌లో కూడా నితిన్ మూవీ చేస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.