ఉస్తాద్ రామ్,మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన స్కంద బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూళ్లను రాబడుతుంది.రెండు రోజుల క్రితం విడుదలైన ఈసినిమాకు పాజిటివ్ రివ్యూస్ రావడంతో ఈ సినిమా మొదటి రోజు 18.2కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఇక నిన్న కూడా సాలిడ్ గా హోల్డ్ చేసి మరో 9.4కోట్లను రాబట్టింది.దాంతో మొత్తం రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 27.6 కోట్ల గ్రాస్ వసూళ్లను సొంతం చేసుకుంది.అయితే బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా గట్టిగానే ఉండడంతో సినిమా ఇదే రన్ ను కొనసాగించాల్సి ఉంటుంది.ఎలాగూ వారాంతం కాబట్టి ఈరెండు రోజులు కూడా మంచి వసూళ్లను రాబట్టుకోనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అటు యూఎస్ఏ లో కూడా స్కంద డీసెంట్ వసూళ్లను రాబడుతుంది.రెండు రోజుల్లో ఈసినిమా 200k డాలర్లకు పైగా వసూళ్లను రాబట్టింది.హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమాలో రామ్ నటన,డ్యాన్స్,యాక్షన్ సన్నివేశాలు హైలైట్ అయ్యాయి.ఈసినిమాలో శ్రీ లీల,సయీ మంజ్రేకర్ హీరోయిన్లు గా నటించగా శ్రీకాంత్,దగ్గుబాటి రాజా,ప్రిన్స్ కీలక పాత్రల్లో కనిపించారు.తమన్ సంగీతం అందించాడు.జీ స్టూడియోస్,శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మించాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: