పొంగల్ బరిలోకే రజనీ లాల్ సలామ్

lal salaam movie release date update

ప్రతి ఏడాది సంక్రాంతికి థియేటర్ల వద్ద పెద్ద సినిమాల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పండుగకు రెండు మూడు నెలల ముందు నుండే డేడ్లను రిజర్వ్ చేసుకుంటారు. ఇక
ఈ ఏడాది ఇంకా మూడు నెలల్లో ముగిసిపోతుంది. ఇప్పటికే చాలా సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగనున్నాయి. తెలుగు నుండి ఇప్పటికే ప్రాజెక్ట్ కే, మహేష్ గుంటూరు కారం, హనుమాన్ ఇంకా పలు సినిమాలు రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లో రజనీ లాల్ సలామ్ కూడా చేరిపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఐశ్వర్య దర్శకత్వంలో విష్ణు విశాల్ ఇంకా విక్రాంత్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా లాల్ సలామ్. స్పోర్ట్ బేస్డ్ ఇంకా మరియు మత కల్లోల కథాంశంతో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఈసినిమాలో రజనీకాంత్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈసినిమా కూడా పొంగల్ బరిలోకే దిగనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అయితే డేట్ ను ఇంకా ఫిక్స్ చేయలేదు. డేట్ ను కూడా త్వరలో ప్రకటించనున్నట్టు తెలుస్తుంది.

ఇంకా ఈసినిమాలో జీవిత రాజశేఖర్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుంది. రజనీకాంత్ సోదరి పాత్రలో నటిస్తుంది. చాలా కాలం తరువాత జీవిత మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది. ఈ మూవీకి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 3 =