హరీష్ శంకర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కాబట్టి ఈసినిమాపై అంచనాల్ ఏర్పడటం కామనే. హరీష్ కూడా ఎప్పటినుండో పవన్ సినిమాను చేయాలని వెయిట్ చేసి ఫైనల్ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ తో వచ్చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే కదా. పవన్ కూడా తను ఒకపక్క రాజకీయాలతో బిజీగా ఉన్నా కూడా తనకు ఏమాత్రం టైమ్ దొరికినా షూటింగ్ లలో పాల్గొంటున్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ కు సంబంధించి అప్ డేట్స్ కూడా ఎప్పటికప్పుడు హరీష్ శంకర్ తెలియచేస్తూనే ఉన్నాడు. తాజాగా మరో అప్ డేట్ ఇచ్చాడు. ఈసినిమాలోని ఇంపార్టెంట్ అండ్ ఇంటెన్స్ పార్ట్ పూర్తయింది.. పవన్ కళ్యాణ్‌గారికి థ్యాంక్స్ అంటూ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.
Done with the most important and intense part of #UstaadBhagatSingh
Kudos to @PawanKalyan gaaru for an exploding performance watch out this space for more !! pic.twitter.com/HMMIxSjU8I— Harish Shankar .S (@harish2you) September 30, 2023
కాగా ఈసినిమాలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది. కాగా ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. ఈసినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: