తలైవా రజనీ కాంత్ తో పాటు ఆయన ఫ్యాన్స్ కూాడా ఎప్పటినుండో ఒక సూపర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. గత కొద్దికాలంగా రజనీకి మంచి హిట్ పడింది లేదు.. దీంతో ఈసినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు. ఇక ఎదురుచూసినట్టే ఈసినిమా రిలీజ్ అయి మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా సాలిడ్ కలెక్షన్స్ ను అందించింది. దాదాపు 600 కోట్లకు పైగా కలెక్షన్స్ ను అందించింది. ఇక ఈసినిమా లాభాలను సైతం తెచ్చిపెట్టడంతో రజనీకి, డైరెక్టర్ కు కాస్ట్లీ బహుమతులు ఇచ్చాడు. అంతేకాదు చిత్రయూనిట్ కు సైతం గోల్డ్ కాయిన్స్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా సక్సెస్ పై రజనీ స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజానికి నేను జైలర్ సినిమా అబౌవ్ ఏవరేజ్ సినిమా అవుతుంది అనుకున్నా.. కానీ అనిరుథ్ అందించిన నేపథ్య సంగీతం వల్ల ఈసినిమా సూపర్ హిట్ అయింది. తన ఫ్రెండ్ కు ఎలాగైనా హిట్ ఇవ్వాలని చాలా కష్టపడి మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ను అందించి.. తన సంగీతంతో సినిమాను ఎక్కడికోో తీసుకెళ్లాడని అన్నారు. అంతేకాదు ఈసినిమా సూపర్ హిట్ తో తన తర్వాత సినిమాకు టెన్షన్ పెరిగిందని తెలిపారు.
కాగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాలో ఇంకా రమ్యకృష్ణ, తమన్నా, సునీల్, యోగిబాబు తదితరులు కీలకపాత్రల్లో నటించారు. అంతేకాదు శివ రాజ్ కుమార్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్ కూడా అతిథి పాత్రల్లో కనిపించారు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈసినిమాకు అనిరుధ్ సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: