చంద్రబాబు అరెస్ట్ పై సురేష్ బాబు షాకింగ్ కామెంట్స్

producer suresh babu shocking comments on chandrababu arrest

ఇప్పుడు ఒక భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలను మరో భాషలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. అలా రిలీజ్ అయ్యే ఇక్కడ సంచలనాలు సృష్టించాయి కె.జి.యఫ్, కాంతార. ఒకరకంగా ఇప్పుడు ఈ సంప్రదాయం నడవడానికి ఈసినిమాలే ఒక కారణంగా కూడా చెప్పొచ్చు. ఈనేపథ్యంలోనే ఇప్పటికే ఎన్నో సినిమాలు తెలుగులో రిలీజ్ అవ్వగా ఇప్పుడు మరో సూపర్ హిట్ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఆ సినిమా మరేదో కాదు కన్నడలో సూపర్ హిట్ అయిన సప్త సాగరదాచే ఎల్లో.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హేమంత్ రావు ఎమ్ దర్శకత్వంలో రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్  హీరో హీరోయిన్లుగా ఈసినిమాలో నటించారు. ఇక ఈసినిమా ఈ నెల 1న రిలీజ్ అయి సూపర్ హిట్ అవ్వడమే కాకుండా విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఇప్పుడు ఈసినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తెలుగులో విడుదలచేస్తుంది. ఇక ఈసినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేసారు. దీనిలో భాగంగా ఈసినిమా ట్రైలర్ ను కూడా విడుదలచేశారు.

అయితే ఈప్రమోషన్స్ లో భాగంగానే ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఓ కార్యక్రమాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు అరెస్ట్ పై ఫిలిం ఇండస్ట్రీ రెస్పాన్స్ అవ్వట్లేదు అన్న ప్రశ్న ఎదురవ్వగా దానికి సమాధానంగా ఇండస్ట్రీ అనేది ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉండాలనే అనుకుంటాను.. అవన్నీ కూడా సున్నితమైన అంశాలు.. ఆంధ్ర, తెలంగాణలో కూడా ఇండస్ట్రీ ఏనాడూ జోక్యం చేసుకోలేదు.. ఇండస్ట్రీ తన అభిప్రాయాన్ని చెప్పలేదు.. రాజకీయాలకు అతీతంగా ఉండటమే ఈ ఇండస్ట్రీకి మంచిది..నా వరకు అయినా ఈ ఇండస్ట్రీని రాజకీయ, కుల, మతాలకు అతీతంగా ఉంచితే బెటర్ అనిపిస్తుంది అంటూ వ్యాఖ్యానించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − 11 =