ప్రతి డైరెక్టర్ తాను తీసిన సినిమా సూపర్ హిట్ అవ్వాలని.. అవార్డులు రావాలని కోరుకుంటారు. ఇక ఇప్పుడు డైరెక్టర్ అట్లీ కూడా అదే కోరుకుంటున్నాడు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో వచ్చిన సినిమా జవాన్. ఈసినిమా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా ఏ రేంజ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంటుందో చూస్తున్నాం. 10 రోజుల్లో ఈసినిమా దాదాపు 800 కోట్లకు పైగా కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఈ వీకెండ్ లోపులో 1000 కోట్ల క్లబ్ లోకి రావడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అట్లీ ఈసినిమా గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతా అనుకున్నట్టు జరిగితే ఈసినిమా ఆస్కార్ కు వెళుతుంది.. ప్రతి డైరెక్టర్, టెక్నీషియన్స్, హీరో, హీరోయిన్ ఇలా సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరూ తాము నటించిన చిత్రానికి అవార్డులు రావాలనే కోరుకుంటారు. అందులోనూ ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్, నేషనల్ అవార్డ్స్.. ఇలా ప్రతిష్ఠాత్మకమైన అవార్డులు తమ సినిమాలకు రావాలనుకుంటారు. నేను కూడా అంతే. నాకు జవాన్ సినిమాని ఆస్కార్‌కి తీసుకెళ్లాలనే కోరిక ఉంది.. షారుఖ్ తో మాట్లాడి ఈసినిమాను ఎలాగైనా ఆస్కార్ కు పంపిచే ప్రయత్నం చేస్తా అంటూ తెలిపాడు. ప్రస్తుతం అట్లీ చేసిన వ్యాఖ్యలు అయితే వైరలు అవుతున్నాయి.
కాగా మన సౌత్ సినిమాలకు ఆస్కార్ అవార్డ్ వస్తుందా అని ఎంతో కాలంగా ఎదురుచూస్తుండగా.. ఆర్ఆర్ఆర్ తో ఆ కోరిక తీరిపోయింది. అంతేకాదు ఆర్ఆర్ఆర్ తో తెలుగు సినిమా సత్తా ప్రపంచానికి తెలిసింది. మరి జవాన్ సినిమాతో అట్లీ కోరిక తీరుతుందో?లేదో? చూద్దాం..
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: