టాలీవుడ్ హీరో సుధీర్ బాబు తాను చేసే ప్రతి చిత్రంలో ఎదో ఒక కొత్తదనం చూపించడానికి ప్రయత్నిస్తుంటాడు. ‘సమ్మోహనం’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. అనంతరం ఈ క్రేజ్‌ను కంటిన్యూ చేసుకోవడానికి విపరీతంగా శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలో సుధీర్ బాబు తాజాగా నటిస్తోన్న చిత్రం ‘మామా మశ్చీంద్ర’. ప్రముఖ నటుడు, రచయిత హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ మూవీని అక్టోబర్ 6న గ్రాండ్‌గా విడుదల చేయనున్న నేపథ్యంలో మేకర్స్ బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్స్ ప్రకటిస్తూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ పై దృష్టి పెట్టింది. దీనిలో భాగంగా తాజాగా ‘అడిగా అడిగా’ అంటూ సాగే అమ్మ పాటను రిలీజ్ చేసింది. ఈ పాటను చేతన్ భరద్వాజ్ స్వర పరచగా.. శ్రీనివాసన్ ఆలపించాడు. ఇక ఇప్పటికే మూవీకి సంబంధించి రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ సినిమాపై అంచనాలను పెంచగా.. ‘గాలుల్లోనా’ అనే ఫస్ట్ సింగిల్ సాంగ్ మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేస్తోంది. కాగా ‘మామా మశ్చీంద్ర’ చిత్రంలో ఈషా రెబ్బా, మృణాళిని రవి ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తుండగా.. హర్షవర్ధన్, అలీ రెజా, రాజీవ్ కనకాల, హరితేజ, అజయ్, మిర్చి కిరణ్ ఇతర నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
అయితే ముందే చెప్పుకున్నట్లు సుధీర్ బాబు ఈ మూవీలో కూడా ఒక సరికొత్త ప్రయోగానికి తెరతీసాడు. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉండే మూడు విభిన్న గెటప్స్‌లో ఆయన కనిపించనున్నాడు. ఓల్డ్ డాన్ పాత్రలో (పరశురాం), ఊబకాయం కలిగిన వ్యక్తిలా (దుర్గ) మరియు స్టైలిష్ డీజేగా సుధీర్ బాబు నటిస్తున్నాడు. ఈ మూడు పాత్రలకు సంబంధించి లుక్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. తెలుగు, హిందీ బైలింగ్యువల్ సినిమాగా రూపొందిన ఈ చిత్రాన్ని సృష్టి సెల్యులాయిడ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్, ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై సునీల్ నారంగ్, సృష్టి సమర్పిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: