శివ కొరటాల దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న 30వ సినిమా దేవర.హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈసినిమా నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది.ఇక ఈసినిమా నుండి ఈరోజు సైఫ్ అలీ ఖాన్ బర్త్ డే సందర్బంగా ఆయన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్.సైఫ్ ఈసినిమాలో భైర అనే పాత్రలో ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
BHAIRA
Happy Birthday Saif sir !#Devara pic.twitter.com/DovAh2Y781
— Jr NTR (@tarak9999) August 16, 2023
జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.తెలుగులో ఆమెకు ఇదే మొదటి సినిమా. భారీ విఎఫ్ఎక్స్ తో దేవర ను తెరకెక్కిస్తున్నారు.అనిరుధ్ సంగీతం అందిస్తుండగా యువ సుధ ఆర్ట్స్,ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈసినిమా తెలుగుతోపాటు హిందీ, మలయాళం,తమిళ,కన్నడ భాషల్లో విడుదలకానుంది.ఈసినిమా ఫై భారీ అంచనాలు వున్నాయి.
ఇక ఎన్టీఆర్,కొరటాల కాంబో లో ఇది రెండో సినిమా. ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.మరి ఈసారి దేవర తో కూడా అదే ఫలితాన్ని రిపీట్ చేస్తారో లేదో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: