మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త చిత్రం ‘ఆపరేషన్ వేలంటైన్’

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కొత్త చిత్రం టైటిల్ మరియు విడుదల తేది ఖరారు అయింది. వరుణ్ తేజ్ 13వ చిత్రంగా వస్తోన్న ఈ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ మూవీ ఇప్పటి వరకు VT 13‌ అనే వర్కింగ్ టైటిల్‌‌తో షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రానికి ‘ఆపరేషన్ వేలంటైన్’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ మేరకు ఈమేరకు హీరో వరుణ్ తేజ్ టైటిల్ పోస్టర్‌ను సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. దీనికి ‘ఆకాశమంతటా ప్రతిధ్వనిస్తున్న భారతదేశ గర్జనను వినండి’ అని ఆయన క్యాప్షన్ పెట్టారు. అలాగే ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 8వ తేదీన విడుదల చేయబోతున్నట్లుగా టైటిల్ పోస్టర్‌లో మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. తాజాగా విడుదల చేసిన టైటిల్ లుక్‌లో ఒక విస్పోనంతో పాటు వరుణ్ తేజ్ ఇంటెన్స్ లుక్‌ని కూడా చూపించారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, స్టిల్స్, వీడియోలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ నేపథ్యంలో తాజాగా విడుదల చేసిన పోస్టర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. కాగా ఈ సినిమాలో వరుణ్ తేజ్ IAF అధికారిగా కనిపించనున్నారు. దీనికి సంబంధించిన లుక్‌ని ఇంతకు ముందు విడుదల చేసిన పోస్టర్స్‌ ద్వారా రివీల్ చేశారు. ఇక ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఇటీవలే ఒక హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్‌ని భారీ స్థాయిలో చిత్రీకరించినట్లు తెలుస్తోంది. దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా కథ నిజ సంఘటనల స్ఫూర్తితో తీసుకున్నట్లు దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ హడా ఇప్పటికే ప్రకటించారు. ఇందులో దేశం ఇప్పటి వరకు చూడని వాస్తవ సంఘటనల స్ఫూర్తితో, భారత వైమానిక దళ ధైర్య సాహసాలని చూపిన నిజ జీవిత హీరోల పోరాట స్ఫూర్తిని తెలియజేసే విధంగా రూపొందిస్తున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. అలాగే ‘ఆపరేషన్ వాలెంటైన్’.. దేశభక్తి, ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎంటర్‌టైనర్. ఫ్రంట్ లైన్ లో వున్న వైమానిక దళ వీరుల అలుపెరగని స్ఫూర్తిని, మునుపెన్నడూ చూడని పోరాటాన్ని, వైమానిక దాడులలో వారు ఎదుర్కొన్న సవాళ్లను చూపనుందని కూడా తెలిపింది.

ఇక ఈ సినిమాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్‌గా వరుణ్ తేజ్ నటిస్తుండగా.. మాజీ మిస్ యూనివర్స్ మానుషి చిల్లార్ రాడార్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా కోసం హీరో వరుణ్ తేజ్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నట్లు సమాచారం. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా వరుణ్ తేజ్ హిందీలో అరంగేట్రం చేస్తున్నారు. హిందీ, తెలుగు భాషలలో ఏకకాలంలో చిత్రీకరించారు. అయితే మేకర్స్ తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదిలా ఉండగా.. వరుణ్ తేజ్ నటిస్తున్న మరో యాక్షన్ డ్రామా ‘గాంఢీవధారి అర్జున’. ప్రవీణ్ సత్తారు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తోంది. ఆగస్టు 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘ఆపరేషన్ వేలంటైన్’ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, రినైసెన్స్ పిక్చర్స్ సందీప్ ముద్దా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. అలాగే నందకుమార్ అబ్బినేని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 2022 విడుదలైన ‘మేజర్’ భారీ విజయం తర్వాత, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ మరో దేశభక్తి కథతో వస్తుండటం విశేషం. అనుభవజ్ఞుడైన యాడ్-ఫిల్మ్ మేకర్, సినిమాటోగ్రాఫర్ , VFX నిపుణుడైన శక్తి ప్రతాప్ సింగ్ హడా ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా, అమీర్ ఖాన్, సిద్ధార్థ్ రాజ్ కుమార్ తదితరులు కథ అందించిన ఈ చిత్రం డిసెంబర్ 8, 2023న దేశవ్యాప్తంగా విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =