బేబి కి మెగా ట్రీట్

Megastar Chiranjeevi Appreciate Baby Movie Producer

ఏ సినిమా ఎప్పుడు ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చెప్పడం కష్టమైపోయింది ఇప్పుడు. బాగా ఆడుతుంది అనే సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సినిమాలు .. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి రికార్డులు క్రియేట్ చేసే సినిమాలూ ఉన్నాయి. అలాంటి ఉదాహరణలు ఈమధ్య కాలంలో చాలానే చూశాం. ఇప్పుడు బేబి సినిమా కూడా అలాంటి కోవలోకే వస్తుంది. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా ఇప్పుడు బాక్సాఫీస్ ను బద్దలు కొడుతుంది. యూత్ ఫుల్ లవ్ స్టోరీ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా యూత్ ను బాగా ఆకట్టుకుంటుండటంతో సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాపై ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు స్పందించి ప్రశంసలు కురిపించారు. తమిళ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ కూడా ఈసినిమాపై స్పందించారంటే బాక్సాఫీస్ వద్ద ఈసినిమా ఎంత ప్రభావం చూపిస్తుందో అర్థంచేసుకోవచ్చు. ఇక ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరు కూడా చిత్రయూనిట్ అభినందించారు. నేడు ఈసినిమా డైరెక్టర్ సాయి రాజేష్ ను అలానే నిర్మాత ఎస్కేఎన్ ను ఇంటికి పిలిపించుకొని డైెరెక్టర్ ఇంకా నిర్మాతపై ప్రశంసలు కురిపించారు. ఇక ఈ ఫొటోలను నిర్మాత ఎస్కేఎన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

కాగా సాయి రాజేష్ దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందించింది ఈసినిమా. మాస్ మూవీ మేకర్స్‌పై ఎస్‌కేఎన్ నిర్మించారు. సినిమాకు విజయ్ బుల్ గానిన్ సంగీతం అందించారు. కాగా సినిమాటోగ్రాఫర్ గా బాల్ రెడ్డి, ఎడిటర్ గా విప్లవ్ నైషధం పనిచేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine + 13 =