బ్రో మూవీ మేకింగ్ వీడియో రిలీజ్

bro telugu movie making video out now

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు మెగా అభిమానులు ఎదురుచూస్తున్న టైమ్ వచ్చేస్తుంది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న బ్రో సినిమా మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసినిమాతో పవన్ కళ్యాణ్ హ్యాట్రిక్ కొడతాడా?లేదా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సముద్రఖని దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా జులై28వ తేదీన రిలీజ్ కానుండటంతో ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది చిత్రయూనిట్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమాకు ఇప్పటికే రావాల్సినంత బజ్ వచ్చేసింది. సినిమా ఫస్ట్ పోస్టర్ నుండి రెండు రోజుల క్రితం రిలీజ్ చేసిన ట్రైలర్ వరకూ అన్నీ సినిమాపై అంచనాలు పెంచాయి తప్పాా ఎక్కడా నిరుత్సాహపరచలేదు. టీజర్, ట్రైలర్, పాటలు ఒకదానికి మించి ఒకటి ఉండటంతో సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇక రిలీజ్ కు మరికొద్ది గంటలు ఉన్నా కూడా చిత్రయూనిట్ మాత్రం ఏదో ఒక అప్ డేట్ ఇస్తూనే ఉంది. ఈనేపథ్యంలోనే తాజాగా మరో అప్ డేట్ తో వచ్చేశారు. ఈసినిమా మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఇక మేకింగ్ వీడియోను చూస్తుంటే షూటింగ్ మాత్రం చాలా సరదాగా జరిగినట్టు కనిపిస్తుంది.

కాగా సముద్రఖని దర్శకత్వంలో తాను తమిళంలో తీసి సూపర్ హిట్ ను అందుకున్న వినోదయ సీతం అనే సినిమాను ఇక్కడ బ్రో టైటిల్ తో రీమేక్ చేస్తున్నాడు. ఈసినిమాలో హీరోయిన్ గా కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, ప్రియా ప్రకాష్ వారియర్, రాజా చెంబోలు పలు కీలకపాత్రల్లో నటించనున్నారు. కాగా కాగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమాకు టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాకు డైలాగులు స్క్రీన్ ప్లే.. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × five =