పవర్ స్టార్ పవన కళ్యాణ్ మాత్రం ప్రస్తుతం పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. ఒక సినిమా షూటింగ్ తరువాత మరొక సినిమా షూటింగ్ లో పాల్గొంటూ సినిమాలను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని చూస్తున్నాడు. ఇప్పటికే ఒక సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉంది. జులై 28వ తేదీన ఈసినిమా రిలీజ్ కానుంది. ఇక పవన్ లిస్ట్ లో ఉన్న సినిమాల్లో సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ సినిమా కూడా ఒకటి. ఈసినిమా లో పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇక ఈసినిమాపై ఇప్పటికే అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా ఇప్పుడు ఆ అంచనాలను మరింత రెట్టింపు చేస్తున్నాడు థమన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న థమన్ ఓజీ సినిమా గురించి మాట్లాడుతూ.. ఈసినిమా మ్యూజిక్ ఓ రేంజ్ లో ఉంటుందని.. ఈసినిమా పాటలు ఇంకా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అలానే పాటలు కేవలం పవన్ ఫ్యాన్స్ ను మాత్రమే కాదు సినీ ప్రేక్షకులందరినీ అలరిస్తాయి. ఓజీ కోసం చిత్రయూనిట్ అంతా ఎంతో కష్టపడుతుందని తెలిపాడు.
ఈసినిమాలో ప్రియాంక అరుళ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. రవి..కె.చంద్రన్ డీవోపీ అందిస్తున్నారు. తెలుగు తోపాటు హిందీ, మలయాళం, తమిళ్ మరియు కన్నడ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకి సిద్ధమవుతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: