బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ చాలా గ్యాప్ తరువాత పఠాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈసినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నాడు. జవాన్ అనే టైటిల్ తో ఈసినిమా రానుంది. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది జవాన్. షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా నుండి ప్రివ్యూ పేరుతో టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రివ్యూలో విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, షారుఖ్ మేకోవర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేసింది. అంతేకాదు జవాన్ తో మరో హిట్ ను అందుకునే అవకాశం ఉందన్న అభిప్రాయాలు కూడా వెలువడ్డాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమాకు సంబంధించి ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈసినిమాలో ఓ స్టార్ హీరో కూడా అతిథి పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఆ స్టార్ హీరో ఎవరో కాదు దళపతి విజయ్. విజయ్ ఈసినిమాలో అతిథి పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు రాగా ఇప్పుడు ఆవార్తలు నిజమే అని క్లారిటీ వచ్చేసింది. తాజాగా ఈసినిమాకు యాక్షన్ డైరెక్టర్ గా పనిచేసిన యాంకిన్ బెన్ ఈవిషయాన్ని తెలియచేశాడు. ఈసినిమాలో విజయ్ అతిధి పాత్రలో నటిస్తున్నట్టు బెన్ తెలిపినట్టు సమాచారం. దీంతో అటు షారుఖ్ ఖాన్, ఇటు విజయ్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీలో ఉన్నారు.
కాగా ఈసినిమాలో షారుక్ రెండు డిఫరెంట్ పాత్రల్లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఒకటి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా.. మరొకటి గ్యాంగ్‌స్టర్‌గా ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. ఈసినిమాలోనయనతార హీరోయిన్ గా నటిస్తుండగా.. విజయ్ సేతుపతి, ప్రియమణి, యోగి బాబు, సునీల్ గ్రోవర్ కూడా పలు పాత్రల్లో నటిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై గౌరీఖాన్ నిర్మించనున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: