అనీల్ కన్నెగంటి దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా వచ్చిన సినిమా హిడింబ.క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కింది. ప్రమోషన్స్ తోనే రిలీజ్ కు ముందే సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశారు. ఈసినిమా రీసెంట్ గానే జులై 20వ తేదీన రిలీజ్ అయి మంచి టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక్కడ హిట్ అవ్వడంతో ఇప్పుడు ఈసినిమాను మరో లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ చేయడానికి సిద్దమవుతున్నారు మేకర్స్. కన్నడ భాషలో ఈసినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దండుపాళ్యం మూవీ మేకర్స్ త్రిశూల్ ఎంటర్ టైన్ మెంట్స్ వారు ఈసినిమను రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. రిలీజ్ డేట్ త్వరలో ప్రకటించనున్నారు. మరి అక్కడ ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో తెలియాలంటే రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
The BLOODY SCARY BLOCKBUSTER #HIDIMBHA is ready to set its foot in Kannada 🤩
Release by #TrishulEntertainments 🤗@imashwinbabu @Nanditasweta @aneelkanneganti #SreedharGangapatnam @AnilSunkara1 #SVKCinemas @AKentsOfficial #OAK pic.twitter.com/AQYUSGzSvs
— AK Entertainments (@AKentsOfficial) July 25, 2023
కాగా నందిత శ్వేత హీరోయిన్ గా నటించిన ఈసినిమాలో రాజీవ్ కనకాల , రఘు కుంచె , శ్రీనివాసరెడ్డి ముఖ్య పాత్రలలో నటించారు. బి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ.. వికాస్ బడిసా సంగీతం అందించగా.. ఎస్ వి కె సినిమాస్ బ్యానర్ పై ఈసినిమాను నిర్మించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: