ఆలస్యంగా మొదలుకానున్న బ్రో ప్రీ రిలీజ్ ఈవెంట్

bro movie pre release event time changed

సముద్రఖని దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా బ్రో. క్రేజీ కాంబినేషన్ లో ఈసినిమా వస్తుంది కాబట్టి ఈసినిమాకు అంత క్రేజ్ ఏర్పడింది. తమిళంలో సముద్రఖని దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్ అయిన వినోదయ సీతం సినిమాకు ఈసినిమా రీమేక్. ఇక్కడ కూడా సముద్రఖనే దర్శకత్వం వహిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నేడు అంటే జులై 25వ తేదీన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే కదా. సాయంత్రం 6 గంటల నుండి ఈ ఈవెంట్ ను స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేశారు. అయితే ఈ ఇప్పుడు ఈవెంట్ ను ఆలస్యంగా ప్రారంభించనున్నారు. ఈమేరకు చిత్రయూనిట్ తమ ట్విట్టర్ ద్వారా రీ షెడ్యూల్ చేస్తూ తెలియచేసింది. వర్షాల కారణంగా ఈవెంట్ ను 8.30 గంటలకు ప్రారంభించనున్నట్టు తెలిపారు.

ఇక ఈసినిమాకోసం అటు పవన్ అభిమానులు, మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక మరో రెండు రోజుల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ట్రైలర్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే 27 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుందంటేనే చెప్పొచ్చు ఈసినిమా కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నారో.. పాటలు కూడా బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా థీమ్ ఆఫ్ బ్రో అంటూ ఒకపాటను రిలీజ్ చేయగా ఆ పాటకు కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది.

ఈసినిమాలో హీరోయిన్ గా కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, ప్రియా ప్రకాష్ వారియర్, రాజా చెంబోలు పలు కీలకపాత్రల్లో నటించనున్నారు. కాగా కాగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమాకు టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాకు డైలాగులు స్క్రీన్ ప్లే.. థమన్ సంగీతం అందిస్తున్నాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × four =