భోళాశంకర్ నుండి మిల్కీ బ్యూటీ ఫుల్ సాంగ్ రిలీజ్

milky beauty full song released from bholaa shankar movie

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో వస్తున్న సినిమా భోళాశంకర్. ఈసినిమా తమిళ్ లో రిలీజ్ అయి సూపర్ హిట్ అయి వేదాళం సినిమాకు రీమేక్ గా ఈసినిమా వస్తుంది. ఈసినిమా ఆగష్ట్ 11వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ కు ఎంత రెస్పాన్స్ వచ్చిందో చూశాం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరోవైపు ఈసినిమా నుండి వరుసగా పాటలను రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు మేకర్స్. ఇప్పటికే రెండు పాటలను రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పుడు ఈసినిమా నుండి మూడో పాటను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మిల్కీ బ్యూటీ నువ్వే నా స్వీటీ అంటూ వచ్చే ఈపాట ప్రోమోను నిన్న రిలీజ్ చేయగా తాజాగా ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. విజయ్ ప్రకాష్, సంజన కల్మంజే ఆలపించారు. ఇక అందమైన లొకేషన్లలో అంతే అందంగా చిరు, తమన్నా స్టెప్పులు వేస్తుడటంతో ఈపాట కూడా ఆకట్టుకుంటుంది.

కాగా ఈసినిమాలో చిరు కి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈసినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. వీరితో పాటు రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను ఉన్నారు.ఇక ఈసినిమాను ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంగీతం మహతి సాగర్.. సినిమాటోగ్రఫి డూడ్లే అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.