ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా సలార్. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉండటంలో ఆశ్చర్యం ఏం లేదు. దానికి తోడు ఈసినిమా కె.జి.యఫ్ ను మించి ఉంటుందని.. యాక్షన్ సీక్వెన్స్ కానీ.. గ్రాఫిక్ వర్స్, ప్రొడక్షన్ వాల్యూస్ ఇలా కె.జి.యఫ్ కు రెండింతలు సలార్ లో ఉంటుందని మేకర్స్ ఇప్పటికే చెప్పారు. అందుకే ప్రేక్షకులు కూడా ఈసినిమా కోసం ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాను సెట్స్ పైకి వెళ్లి చాలా కాలమైంది. షూటింగ్ కూాడా చాలా వరకూ పూర్తయింది. మధ్యలో ప్రభాస్ వేరే సినిమాల షూటింగ్ లతో బిజీగా ఉండటంతో ఈసినిమాా కాస్త లేటయింది.. ప్రస్తుతం అయితే షూటింగ్ ను పూర్తిచేసే పనిలో ఉన్నారు. ఇక ఈసినిమా నుండి ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటినుండోో ఎదురుచూస్తున్న అప్ డేట్ వచ్చేసింది. ఆ అప్ డేట్ మరేదో కాదు సలార్ టీజర్ ది. నిజానికి ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు అంతకుమించి అన్నట్టు సలార్ టీజర్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈసినిమా టీజర్ ను జులై 6వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. జులై 6వ తేదీన సాయంత్రం 5 గంటల 12 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. దీంతో సలార్ టీజర్ కోసం ఇప్పటినుండే ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
𝐁𝐫𝐚𝐜𝐞 𝐲𝐨𝐮𝐫𝐬𝐞𝐥𝐟 𝐟𝐨𝐫 𝐭𝐡𝐞 𝐦𝐨𝐬𝐭 𝐯𝐢𝐨𝐥𝐞𝐧𝐭 𝐦𝐚𝐧, #𝐒𝐀𝐋𝐀𝐀𝐑 🔥
Watch #SalaarTeaser on July 6th at 5:12 AM on https://t.co/QxtFZcNhrG #SalaarTeaserOnJuly6th#Prabhas #PrashanthNeel @PrithviOfficial @hombalefilms #VijayKiragandur @IamJagguBhai… pic.twitter.com/Vx1i5oPLFI
— Hombale Films (@hombalefilms) July 3, 2023
కాగా ఈసినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రేయ రెడ్డి కీలక పాత్రలలో నటిస్తున్నారు. హోంబలే ఫిలిమ్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ మూవీ ‘కె.జి.యఫ్’ నిర్మించిన విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తుండగా భువన్ గౌడ సినిమాటోగ్రఫర్ గా పనిచేయనున్నారు. ఈ మూవీ ఈ ఏడాది సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
[td_block_video_youtube playlist_title=”” playlist_yt=”_vX4Lqi5bcs,XOF
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























