సినిమా హిట్ అయితే డైరెక్టర్లకు ఖరీదైన బహుమతులు ఇవ్వడం ఇప్పుడు కామన్ అయిపోయింది. టాలీవుడ్ లో ఇప్పటికే ఎంతో మంది ఇలా ఖరీదైన బహుమతులు అందుకున్నారు. ఇప్పుడు మరో డైరెక్టర్ కు కాస్ట్లీ గిఫ్ట్ అందింది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు విరూపాక్ష సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న కార్తీక్ దండు. కార్తీక్ దండు దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన సినిమా విరూపాక్ష. ఈసినిమా ఏప్రిల్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈసినిమాపై రిలీజ్ కు ముందు నుండీ అంచనాలు ఉండగా ఆ అంచనాలను నిజం చేస్తూ సూపర్ హిట్ అయింది. రుద్రవరం అనే ఊరు.. ఆ ఊరిలో వరుసగా హత్యలు జరగడం.. దానికి కారణం ఏంటో హీరో కనిపెట్టడమే ఈ సినిమా కథ. మిస్టరీ థ్రిల్లర్ గా వచ్చిన ఈసినిమా ఆందరినీ ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాకు కలెక్షన్స్ కూడా భారీగా వచ్చాయి. సాయి ధరమ్ తేజ్ కు కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందించింది. 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఇక ఈనేపథ్యంలో ఈ సినిమా మంచి లాభాలను తెచ్చిపెట్టిన కారణంగా, నిర్మాత బీవీఎస్ ఎన్ ప్రసాద్, హీరో సాయితేజ్ కలిసి ఆయనకి ఒక మెర్సిడెజ్ బెంజ్ కారును సుకుమార్ సమక్షంలో గిఫ్ట్ గా అందజేశారు. ఇక ఈ విషయాన్ని కార్తిక్ తన ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ ఫొటోలు కూడా షేర్ చేశాడు.
Virupaksha is a life time memory for me.. I would like to extend my gratitude to my guru @aryasukku sir, my hero @IamSaiDharamTej and my producers @BvsnP sir and @dvlns sir for this wonderful gift ….. pic.twitter.com/VbmT5Oeiqa
— karthik varma dandu (@karthikdandu86) June 27, 2023
కాగా ఈసినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా తన నటనకు గాను ప్రశంసలు దక్కాయి. సునీల్,సాయి చంద్, అజయ్,బ్రహ్మజీ ముఖ్య పాత్రల్లో కనిపించారు. అజనీష్ లోక్ నాథ్ సంగీతం ఇంకా శామ్ దత్ సినిమాటోగ్రఫి ఈసినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచాయి. ఎస్విసిసి,సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: