సెకండ్ ఇన్నింగ్స్ స్టార్స్ చేసిన తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి రిలీజ్ అయిన సినిమాలు వకీల్ సాబ్ ఇంకా భీమ్లానాయక్. ఈ రెండు సినిమాలు కూాడా బ్లాక్ బస్టర్లు అందుకున్నాయి. ఇక ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే పవర్ స్టార్ లిస్ట్ లో చాలా సినిమాలు ఉన్నాయి. వాటిలో త్వరలో రిలీజ్ కాబోతున్న సినిమా బ్రో. ఈసినిమా కోసం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. సముద్రఖని దర్శకత్వంలో పవన్ కళ్యాణ్– సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రల్లో ఈసినిమా తెరకెక్కుతుంది. తమిల్ లో సూపర్ హిట్ వినోదయం సీతంకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే పవన్ అయితే తన పోర్షన్ ను కంప్లీట్ చేసుకున్నాడు కూడా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాను జులై 28వ తేదీన రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో అందుకు తగ్గట్టుగా సినిమా పనులన్నీ పూర్తిచేస్తున్నారు. షూటింగ్ జరుపుతూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలుపెట్టారు. ఇక ప్రమోషన్ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు.ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్ చేయగా అన్నీమంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. ఇదిలా ఉండగా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు ఇప్పటికే అప్ డేట్లు ఇచ్చారు మేకర్స్. టీజర్ కు సంబంధించిన డబ్బింగ్ వర్క్ కూడా పవన్ పూర్తి చేసినట్టు అప్ డేట్ కూడా ఇచ్చారు. తాజాగా టీజర్ రిలీజ్ టైమ్ ను ప్రకటించారు. ఈసినిమా టీజర్ రేపు అంటే జూన్ 29వ తేదీన సాయంత్రం 5గంటల 4 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
ఈసినిమాలో హీరోయిన్ గా కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, ప్రియా ప్రకాష్ వారియర్, రాజా చెంబోలు పలు కీలకపాత్రల్లో నటించనున్నారు. కాగా కాగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమాకు టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాకు డైలాగులు స్క్రీన్ ప్లే.. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: