దుల్కర్ సల్మాన్ కింగ్ ఆఫ్ కోత టీజర్ రిలీజ్

dulquer salmaan king of kotha telugu teaser is out now

మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన సినిమాలతో అంతే డిఫరెంట్ క్యారెక్టర్స్ సెలెక్ట్ చేసుకుంటూ నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు. అభిలాష్ జోషి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, ఐశ్వర్య లక్ష్మీ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా కింగ్ ఆప్ కోత. గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా 80, 90 కాలం బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇటీవల రిలీజ్ చేసిన కింగ్ ఆఫ్‌ కోత మోషన్ పోస్టర్‌ తోనే సినిమాపై క్యూరియాసిటీని పెంచారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ ను తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశారు. ఈసందర్భంగా మహేష్ ఈసినిమా టీజర్ ను విడుదల చేస్తున్నందుకు సంతోషంగా ఉందని.. దుల్కర్ సల్మాన్ ను మరోసారి ఆకట్టుకునే పాత్రలో చూస్తున్నందుకు ఆనందంగా ఉందని..చిత్రయూనిట్ కు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఇక టీజర్ విషయానికోస్తే రాజు రాక కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు అనే డైలాగ్స్ తో మొదలవుతుంది. తమ భూమిని కాపాడే రాజు అతనొక్కడేనని ఆ ప్రజలు నమ్ముతున్నారు.. అంటూ దుల్కర్ సల్మాన్‌ ఎంట్రీ చూపిస్తారు. గ్యాంగ్‌స్టర్‌లు వారిని అనుసరించే పోలీసులతో పవర్ఫుల్ గా ఈ టీజర్ సాగింది. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్ ప్రెజెన్స్ అలానే సినిమాటోగ్రఫి హైలెట్ గా నిలిచింది. టీజర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది.

కాగా ఈసినిమాలో ఇంకా ప్రసన్న, నైలా ఉషా, చెంబన్ వినోద్‌, గోకుల్ సురేశ్‌, షమ్మీ తిలకన్‌, శాంతి కృష్ణ, వడా చెన్నై శరన్‌, అనిఖా సురేంద్రన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వేఫరెర్‌ ఫిలిమ్స్-జీ స్టూడియోస్‌ సంయుక్తంగా ఈసినిమాను నిర్మిస్తున్నాయి. షాన్ రెహ్మాన్‌, జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తుండగా..నిమిష్ రవి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈసినిమా పాన్ ఇండియా స్థాయిలో మలయాళంతో పాటు తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 1 =