పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో సుజీత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. ఈసినిమా ఓజీ అనే టైటిల్ తో రూపొందుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈసినిమా ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ ను జరుపుకుంటుంది. ఇక ఈసినిమా నుండి వరుసగా పోస్టర్లను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్న నటీనటుల పోస్టర్లను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా ఇప్పుడు మరింత ఎక్స్ పెక్టేషన్స్ ను పెంచుతున్నాడు అర్జున్ దాస్. ఈసినిమాలో అర్జున్ దాస్ ఈసినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈనేపథ్యంలో తాజాగా తన ట్విట్టర్ లో ఈసినిమా గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈసినిమాకు సంబంధించి డైరెక్టర్ సుజీత్ సర్ నాకు కొన్ని విజువల్స్ చూపించారు నా మైండ్ బ్లాక్ అయింది.. సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్ గారి విజువల్స్ సూపర్.. పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్స్, స్వాగ్ అదిరిపోయాయి. పవన్ ఫ్యాన్స్ అసెంబుల్ అవ్వండి.. తుఫాన్ రాబోతుంది అంటూ ఫ్యాన్స్ కు మరింత ఉత్సాహానిచ్చే పోస్ట్ చేశారు.
#Sujeeth Sir was kind enough to show me a few visuals from #OG yesterday & I’m truly blown away.@dop007 Sir’s visuals 🔥@PawanKalyan Garu’s screen presence, swag & dialogues 🔥🔥💥💥
All I will say is – Pawan Kalyan Garu’s fan’s assemble!
The #FireStorm is truly coming!
A…— Arjun Das (@iam_arjundas) June 23, 2023
కాగా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమాలో శ్రీయా రెడ్డి, ఇమ్రాన్ హష్మీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈసినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. రవి..కె.చంద్రన్ డీవోపీ అందిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























