పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన పౌరాణిక సినిమా ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమాలో ప్రభాస్ శ్రీముడిగా, కృతి సనన్ సీతగా నటించారు. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదలై మిక్స్డ్ టాక్‌ను తెచ్చుకుంది. ఈసినిమా కలెక్షన్స్ విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడట్లేదు. ఒకవైపు ఎన్ని వివాదాలు, అభ్యంతరాలు వస్తున్నా మరోవైపు ఈసినిమాకు అంతే రేంజ్ లో ఆదరణ కూడా దక్కుతుంది. ఈసినిమా రిలీజ్ అయి నాలుగు రోజులవుతుంది. నాలుగు రోజులు కూడా బాక్సాఫీస్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే 300 కోట్లను రాబట్టుకొని సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. మొదటి రోజు 140కోట్లు రాగ రెండో రోజు 100కోట్లు మూడో రోజు మరో 100కోట్ల ను రాబట్టింది. ఇక ఈ నాలుగు రోజుల్లో ఈసినిమా 375 కోట్ల మార్క్ ని టచ్ చేసింది. నాలుగో రోజు 35 కోట్లను రాబట్టుకుంది. అయితే ఐదో రోజు వరకూ ఈ సినిమా 400 కోట్ల మార్క్ ని టచ్ చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈసినిమాలో సన్ని సింగ్ లక్ష్మణుడిగా.. సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా.. హనుమంతుడిగా దేవ్ దత్త నటించారు. ఈ సినిమాను టీ-సిరీస్, రెట్రో ఫైల్స్ సంస్థలపై బాలీవుడ్ నిర్మాతలు భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇంకా ఈసినిమాకు సినిమాటోగ్రఫి కార్తిక్ పళని, సంగీతం.. అజయ్ అతుల్, ఎడిటింగ్.. అపూర్వ మోతివాలే అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: