ఓటీటీలో కస్టడీ కి సూపర్ రెస్పాన్స్

custody movie gets super response in ott platform

టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య కూడా ఇప్పుడు డిఫరెంట్ కథలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అందుకే రొటీన్ కు భిన్నంగా ఉండే కథలను ఎంచుకుంటున్నాడు. ఈనేపథ్యంలోనే రీసెంట్ గా కస్టడీ సినిమాతో ముందుకు వచ్చాడు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా వచ్చిన సినిమా కస్టడీ. ఈసినిమా మే12 తేదీన రిలీజ్ అయిన సంగతి తెలిసిందే కదా. ఈసినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈసినిమాలో పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నాగచైతన్య నటన అందరినీ మెప్పించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా ఇప్పటికే ఓటీటీలోకి వచ్చేసిన సంగతి తెలిసిందే కదా. జూన్ 9 నుండి ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోస్ లో ఈసినిమా స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు తమిళ్ తో పాటు మళయాళ మరియు కన్నడ భాషల్లో కూడాా స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఓటీటీలో మాత్రం ఈసినిమా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. ప్రస్తుతం అమెజాన్ లో టాప్ 1లో ట్రెండింగ్ అవుతుంది. అంతేకాదు తమిళ్ వెర్షన్ టాప్ 3 పొజిషన్ లో దూసుకుపోతుంది. మరి ఓటీటీలో ఇంత రెస్పాన్స్ రావడంపై చిత్రయూనిట్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించగా.. అరవింద్ స్వామి, ప్రియమణి, సంపత్ రాజ్, శరత్ కుమార్, ప్రేమ్ జీ, వెన్నెల కిషోర్, ప్రేమి విశ్వనాథ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మించగా.. యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × five =