యానిమల్ టీజర్ అప్పుడే?

crazy update on ranbir kapoors animal movie

అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు సందీప్ వంగా. ఇక ఈసినిమా తరువాత హిందీలో కూడా అర్జున్ రెడ్డి సినిమాను రీమేక్ చేసే ఛాన్స్ ను దక్కించుకున్నాడు. అక్కడ కూడా ఆసినిమా సంచలన విజయం సాధించింది. అంతేకాదు కలెక్షన్స్ కూడా భారీగానే రాబట్టుకుంది. ఆ సినిమా తరువాత అక్కడే బాలీవుడ్ లోనే రణ్ బీర్ తో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు సందీప్.  యానిమల్ అనే టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా షూటింగ్ ను అయితే పూర్తిచేసుకుంటుంది. అయితే షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంటున్నా ఈసినిమా నుండి పెద్దగా అప్ డేట్స్ ఇచ్చింది లేదు. రణ్ బీర్ ఫస్ట్ లుక్ పోస్టర్ తప్పా ఇప్పటివరకూ ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు మేకర్స్. ఈనేపథ్యంలో ఇప్పుడు ఒక ఫ్యాన్స్ ఖుషీ అయ్యే న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట మేకర్స్. దానికి డేట్ కూడా ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. జూన్ 16వ తేదీన ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయాలని చూస్తున్నారట. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వెయిట్ చేయాల్సిందే.

కాగా ఈసినిమాలో నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా అనిల్ కపూర్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. టీ సిరీస్, సినీ వన్ స్టూడియోస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్స్ పై భూషణ్​కుమార్, కిషన్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ, మురాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈసినిమాను ఆగష్ట్ 11, 2023 న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.. మరి అనుకున్న డేట్ కే రిలీజ్ చేస్తారా?లేదా?అన్నది చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 6 =