రివ్యూ : మేమ్ ఫేమస్ 

Mem Famous Telugu Movie Review

నటీనటులు : సుమంత్ ప్రభాస్,సార్య లక్ష్మణ్,మణి,కిరణ్ మచ్చ,మురళీధర్ గౌడ్
సంగీతం : కళ్యాణ్ నాయక్
ఎడిటింగ్ : సృజన అడుసుమిల్లి
సినిమాటోగ్రఫీ : శ్యామ్ దూపాటి
దర్శకత్వం : సుమంత్ ప్రభాస్
నిర్మాతలు : అనురాగ్ రెడ్డి,శరత్ చంద్ర

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రీసెంట్ గా ప్రమోషన్స్ తో హైప్ తెచ్చుకున్న సినిమా మేమ్ ఫేమస్. దాదాపు అందరూ కొత్త వాళ్ళతో లిమిటెడ్ బడ్జెట్ లో తెరకెక్కింది ఈసినిమా.స్పెషల్  ప్రీమియర్స్ షోస్ నుండి పాజిటివ్ టాక్  కూడా  తెచ్చుకుంది.ఇక ఈసినిమా ఈరోజు థియేటర్లోకి వచ్చింది. మరి మేమ్ ఫేమస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ :

ఊర్లో అల్లరి చిల్లరగా తిరిగే మయి (సుమంత్ ప్రభాస్) అతనికి తోడు ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ బాలకృష్ణ (మౌర్య చౌదర్య),దుర్గ (మణి ఎగుర్ల). ఈముగ్గురు ఊర్లో వాళ్ళతో చివాట్లు తింటూ లైఫ్ బిందాస్ గా గడిపేస్తుంటారు.అయితే ఈగ్యాంగ్ ఎలాగైనా ఫేమస్ అయిపోయాలి అని అనుకుంటారు.ఈక్రమంలో  ఊర్లో ఫేమస్ టెంట్ హౌస్ ను ప్రారంభిస్తారు.కొన్నాళ్లు బాగానే నడిచిన ఆ తరువాత ఫైర్ యాక్సిడెంట్ లో అది కాలిపోతుంది.దాంతో మళ్లీ కథ మొదటికొస్తుంది.ఆ తరువాత ఓ యూట్యూబ్ ఛానల్ ను స్టార్ చేసి దాని ద్వారా ఫేమస్ కావాలనుకుంటుంటారు.మరి ఆ ఛానెల్ తో వీరు అనుకున్నది సాధించారా? ఊరికి వీళ్లు  ఏం చేశారు అనేదే మిగితా కథ.

విశ్లేషణ :

ఫేమస్ అవ్వడానికి ముగ్గరు ఫ్రెండ్స్ ఎలాంటి దారిని ఎంచుకున్నారు ఆ క్రమంలో వాళ్ళకు ఎదురైనా సవాళ్లు ఏంటే అనేదే ఈసినిమాకథ.కథలో కొత్తదనం లేదు కానీ కథనంతో టైం పాస్ చేయించి ఓకే అనిపించాడు సుమంత్ ప్రభాస్.డైరెక్టర్ గా అలాగే హీరోగా అతనీకిదే తొలిసినిమా.ఊర్లో జరిగే సన్నివేశాలు సహజంగా అనిపిస్తాయి అయితే సినిమాకు దాదాపు 3గంటల రన్ టైం ఉండడం తో సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది.

ఫస్ట్ హాఫ్ లో  హీరో బ్యాచ్ చేసే అల్లరి అలాగే మయి -మౌనిక,బాలీ-బబ్బి ల ప్రేమకథ లను చూపెట్టి ఆతరువాత ఎమోషనల్ సన్నివేశాలతో ఇంటర్వెల్ కార్డు పడుతుంది.ఇక సెకండ్ హాఫ్ లో యూట్యూబ్ ఛానల్ పెట్టి ఫేమస్ ఎలా అయ్యారు చివరికి వారు అనుకుంది సాధించారా అనేది చూపించారు.మధ్యలో వారికీ సర్పంచ్ సహాయం చేయడం ఇలా సాగిపోతుంది సినిమా.ఇక చివర్లో గోరటి వెంకన్న పాట అలాగే అంజిమామ,లిపిస్టిక్ స్పాయిలర్ సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి.వీటికి తోడు సినిమాను ఎలాంటి బూతు లేకుండా చాలా నీట్ గా తీశారు. యూత్ కు నచ్చే సన్నివేశాలు కూడా చాలానే వున్నాయి.

నటీనటుల విషయానికి వస్తే ఇంస్టాగ్రామ్ రీల్స్,యూట్యూబ్ వీడియోలతో ఫేమస్ అయిన వారిని ఈసినిమాకు సెలెక్ట్ చేసుకున్నాడు సుమంత్ ప్రభాస్.తను కూడా అలా పేరుతెచ్చుకున్నవాడే.సుమంత్ ప్రభాస్ కు ఇదే మొదటి సినిమా అయినా చాలా ఈజ్ తో సహజంగా నటించాడు.బాలకృష్ణ, దుర్గ పాత్రల్లో నటించిన వారు కూడా తమ నటనతో మెప్పించారు.సార్య ,సిరారాసి,మురళీధర్ గౌడ్ ,అంజిమామ తమ పాత్రలకు న్యాయం చేశారు.ఓవరాల్ గా కాస్టింగ్ సినిమాకు హెల్ప్  అయ్యింది.

టెక్నికల్ గా మాత్రం సినిమా పూర్తి స్థాయిలో మెప్పించలేదనే చెప్పాలి.సంగీతం ఓకే..రెండు సాంగ్స్ బాగున్నాయి బీజీఎమ్ డీసెంట్ గా వుంది కానీ సౌండ్ మిక్సింగ్ లో ఇంకొంచెం కేర్ తీసుకోవాల్సింది. సినిమాగ్రఫీ డీసెంట్ గా వుంది.ఎడిటింగ్ పర్వాలేదు కానీ అనవసరమైన సన్నివేశాలను కట్ చేయాల్సింది.రన్ టైం మరి ఎక్కువైంది.నిర్మాతలు సినిమాకు ఎంత ఖర్చు పెట్టాలో అంతే పెట్టారు.

ఓవరాల్ గా ప్రమోషన్స్ తో హడావిడి చేసిన మేమ్ ఫేమస్ థియేటర్లలో టైం పాస్ చేయిస్తుంది. స్టోరీ కొత్తదేం కాకపోయినా సినిమాతో మాత్రం కనెక్ట్ అవుతాం.టైం పాస్ కోసం ఈసినిమాను ఒక సారి చూసేయొచ్చు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here