బన్వర్ సింగ్ తో పుష్ప2 కీలక షెడ్యూల్ పూర్తి

pushpa2 the rule key schedule completed with Bhanwar Singh shekhawat

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాలో తగ్గేదేలే అంటూ తన మార్క్ డైలాగ్ తో పాన్ ఇండియా మార్కెట్ లో తన సత్తా చూపించాడు. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఫుల్ డీ గ్లామరైజ్డ్ గా రా అండ్ రస్టిక్ మేకోవర్ లో గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇక ఇప్పుడు సెకండ్ పార్ట్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. మొదటి పార్ట్ సంచలన విజయం వల్ల ఈ పార్ట్ పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఆ అంచనాలను మరింత పెంచేశాయి అల్లు అర్జున్ బర్త్ డే రోజున రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఇంకా ఈసినిమా గ్లింప్స్. వీటికి వచ్చిన రెస్పాన్స్ తో పార్ట్ 2 కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నారో అర్థమవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలుపెట్టిన సంగతి తెలిసిందే కదా. ఇప్పటివరకూ కొంత వరకూ షూట్ ను కూడా పూర్తి చేసుకుంది. అయితే ఈమధ్య మైత్రీ మేకర్స్, సుకుమార్ కు ఐటీ దాడుల వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే రీసెంట్ గానే మళ్లీ చిత్రయూనిట్ షూటింగ్ ను మొదలుపెట్టింది. మారేడుమిల్ల్ ఫారెస్ట్ ఏరియాలో ఇన్ని రోజులు షూట్ ను జరుపుతూ వచ్చారు. ఇక తాజాగా చిత్రయూనిట్ షూటింగ్ కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇచ్చింది. బన్వర్ సింగ్ తో కీ షెడ్యూల్ కంప్లీట్ అయిందని చెబుతూ సెట్ లో ఉన్న పిక్ ను పోస్ట్ చేశారు.

కాగా పుష్ప..ది రూల్ కూడా మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది. రెండో పార్టులో కూడా కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తుంది. అలానే దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నాడు. అయితే ఇతర నటీనటులపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + twelve =