ఎం.ఎస్ రాజు దర్శకత్వంలో నరేష్, పవిత్రాలోకేష్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా మళ్లీ పెళ్లి. ఈసినిమా కోసం చాలా మంది ఆసక్తికరంగా చూస్తున్నారు మేకర్స్. ఒకరకంగా చెప్పాలంటే ఇది నరేష్ మినీ బయోపిక్ లాగా ఉండటంతో ఈసినిమాకు అంత బజ్ క్రియేట్ అయింది. ఇప్పటికే ఈసినిమాలు పోస్టర్లు, టీజర్ అలానే పాటలు లతో సినిమాపై మరింత ఆసక్తిని పెంచారు మేకర్స్. ఇక నేడు ఈసినిమా ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉందో తెలియాలంటే మాత్రం రివ్యూలోకి వెళ్లాల్సిందే .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నటీనటులు.. నరేష్, పవిత్ర లోకేష్, జయసుధ, శరత్‌బాబు, వనిత విజయకుమార్, అనన్య నాగెళ్ల, రోషన్, రవివర్మ, అన్నపూర్ణ, భద్రం, యుక్త, ప్రవీణ్ యండమూరి, మధు తదితరులు..
దర్శకత్వం.. ఎంఎస్ రాజు
బ్యానర్స్..విజయ కృష్ణ మూవీస్
నిర్మాతలు.. నరేష్
సినిమాటోగ్రఫి.. ఎంఎన్ బాల్ రెడ్డి
సంగీతం.. సురేష్ బొబ్బిలి
కథ..
నిజానికి ఈసినిమాకు కథ అంటూ ప్రత్యేకంగా చెప్పడానికి ఏముండదు. నరేష్ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగానే ఈసినిమా తీసినట్టు అర్థమవుతుంది. నరేష్, పవిత్రల మధ్య ఉన్న రిలేషన్ ఎక్కడి నుంచి ఎలా మొదలైంది.. పెళ్లి వరకూ ఎలా వచ్చింది.. తన మూడో భార్యకు నరేష్ కు మధ్య వచ్చిన మనస్పర్థలు ఏంటి అనేది ఈసినిమా కథ అని అర్థమవుతుంది.
సీనియర్ నటుడు నరేంద్ర (నరేష్ విజయ కృష్ణ) కు ఆయన మూడో భార్య సౌమ్యా సేతుపతి(వనిత) మధ్య దూరం పెరుగుతున్న రోజులు. ఇక అదే సమయంలో నరేంద్రకు నటి పార్వతి (పవిత్రా లోకేష్) పరిచయం అవుతుంది. అప్పటికే పార్వతికి ఫణింద్ర (అద్దూరి రవి వర్మ) తో పెళ్లవుతుంది. కానీ వారి మధ్య కూడా మనస్పర్థలు వల్ల దూరంగా ఉంటారు. మరోవైప నరేంద్ర, పార్వతి ఇద్దరి పరిచయం ప్రేమకు దారితీస్తుంది. అసలు నరేంద్ర, సౌమ్య మధ్య గొడవలు ఏమిటి? పార్వతి, ఫణింద్ర మధ్య గొడవలు ఏమిటి? ఆ అడ్డంకులను దాటి నరేంద్ర, పార్వతి చివరికి పెళ్లి చేసుకున్నారా? లేదా? అన్నది ఈసినిమా కథ.
విశ్లేషణ
నరేష్ సినిమా కెరీర్ కు మాత్రం ఎలాంటి ఢోకా లేదు. ఇప్పటికి కూడా ఆయన చాలా సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తూ కెరీర్ లీడ్ చేస్తున్నారు. అయితే వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో అడ్డంకులు అని చెప్పొచ్చు. అది కూడా నరేష్, పవిత్ర లోకేష్ రిలేషన్ షిప్ ఎప్పుడైతే బయటపడిందో అప్పటినుండి నిరంతరం వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ముఖ్యంగా నరేష్ మూడోో భార్య రమ్య రఘుపతి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. వాటన్నింటినీ ఈసినిమాలో చూపించారు
ఇక ఈసినిమా టీజర్ ట్రైలర్ లు రిలీజ్ చేసినప్పుడే నరేష్ జీవితంలో సంఘటనల ఆధారంగా తీసినట్టు అర్థమైంది. చిత్రయూనిట్ ఆవిషయం చెప్పకపోయినప్పటికీ సినిమా చూస్తే అర్థమవుపోతుంది. ఎం ఎస్ రాజు కూడా ఈ సినిమాను రూపొందించిన విధానం బాగుంది.నరేష్, పవిత్ర ఎలా దగ్గర అయ్యారు? జీవిత భాగస్వామ్యులతో వాళ్ళ సంబంధాలు ఎలా ఉన్నాయి? అనేది చూపించిన సన్నివేశాలు ఎంగేజ్ చేశాయి. అయితే ఈసినిమాలో తన జీవితం గురించి ఓ క్లారిటీ ఇచ్చాడు నరేష్. నరేష్ జీవితంలో మూడు పెళ్లిళ్లెందుకు చేసుకోవాల్సి వచ్చింది..తన మూడో భార్య రమ్యతో ఉన్న గొడవలు.. ముఖ్యంగా ఈ సినిమా తీయడానికి ప్రధాన ఉద్దేశ్యం తనకు, పవిత్రకు మధ్య ఎలాంటి సంబంధం ఉందో ప్రపంచానికి నరేష్ చెప్పాలనుకోవడమే. ఫస్టాఫ్ అంతా పార్వతితో పరిచయం.. ఆ తర్వాత నరేంద్ర ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఈ నేపథ్యంలోనే నడిపారు. కీలకమైన సెకండాఫ్‌లో అసలు మాజీ భార్య సౌమ్యతో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి.. అలాగే పార్వతి లైఫ్‌లో ఏం జరిగింది అనేది చూపించాడు.
పెర్ఫామెన్స్
ఇక ప్రధాన పాత్రల్లో నటించిన నరేష్, పవిత్ర లోకేష్ ఏదో పాత్రల్లో నటిస్తున్నట్టు అనిపించలేదు. నిజ జీవితంలో ఎలా ఉంటారో అలానే ఉంటారనిపించింది. వారి పాత్రల్లో జీవించేశారు. ఇక రమ్య రఘుపతి పాత్రకు వనిత ను తీసుకోవడం ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. ఆ పాత్రలో ఆమె తప్పా వేరొకరు అలా చేయలేరేమో అన్న రేంజ్ లో నటించింది. ఇక విజయ నిర్మల పాత్రలో జయసుధ, కృష్ణ పాత్రలో శరత్ బాబు మెప్పించారు.
టెక్నికల్ వాల్యూస్
ఇక సాంకేతిక పరంగా కూడా ఈసినిమాకు అన్ని ఎలిమెంట్స్ చక్కగా కుదిరాయి. బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, అరుల్ దేవ్ నేపథ్య సంగీతం బావున్నాయి. ఎంఎస్ రాజు తమ స్క్రీన్ ప్లే తో ఏంగేజ్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ఇక సొంత బ్యానర్ కాబట్టి ఈ సినిమా మేకింగ్ లో నరేజ్ ఎలాంటి కాంప్రమైంజ్ కాలేదని అర్థమవుతుంది.
ఇక ఓవరాల్ గా చెప్పాలంటే నరేష్ జీవితంలో జరిగిన విషయాలు తెలుసుకోవాలనుకునే వారు ఈసినిమా చూడొచ్చు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: