పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ఓజీ. ఈసినిమాలో పవన్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తుండటం.. దానికితోడు క్లాసీ యాక్షన్ ఎంటర్ టైనర్ లు తెరకెక్కించడంలో సుజీత్ కు అనుభవం ఉండటంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉండటమే కాకుండా.. ఈసినిమా కోసం అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ తో బిజీగా ఉంది. ఇప్పటికే ముంబై ఇంకా పూణేలో కీలక సన్నివేశాలు పూర్తి చేసుకొని ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. సెకండ్ షెడ్యూల్ కూడా రీసెంట్ గానే స్టార్ట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా గురించి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది. ఈసినిమాను మరింత భారీ స్థాయిలో తీసుకురావాలని చూస్తున్నారట మేకర్స్. ఈనేపథ్యంలోనే ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ప్లాన్ చేస్తున్నారు. అంతేకాకుండా ఓ బాలీవుడ్ స్టార్ హీరోను విలన్ గా తీసుకురానున్నారట. మరి ఇందులో ఎంత నిజముంది. ఆ స్టార్ హీరో ఎవరో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఈసినిమాలో ప్రియాంక అరుళ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాను డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా.. రవి..కె.చంద్రన్ డీవోపీ అందిస్తున్నారు. తెలుగు తోపాటు హిందీ, మలయాళం, తమిళ్ మరియు కన్నడ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ లో విడుదలకి సిద్ధమవుతోంది. ఈసినిమాను క్రిస్మస్ కు రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: